అనుకున్నట్టే జరిగింది.. ప్రభాస్​కు పోటీగా కశ్మీర్​​ ఫైల్స్​ డెరెక్టర్​

అయితే ఇప్పుడాయన సినిమాకు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం పోటీగా రాబోతున్నారు.

Update: 2023-08-15 10:37 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్​గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన సినిమా థియేటర్‌లో రిలీజ్ అవుతుందంటే ఎలాంటి సినిమాలైనా పక్కకు తప్పుకోవాల్సిందే అన్నంతగా మార్కెట్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడాయన సినిమాకు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం పోటీగా రాబోతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ 'సలార్‌'. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలే ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్​,పోస్టర్స్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పక్కా రూ.1000కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే ఇలాంటి సమయంలో 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'తో ఒక్కసారిగా ఫేమ్‌ సంపాదించుకున్న దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి.. ప్రభాస్​తో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఆయన తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం 'ది వ్యాక్సిన్‌ వార్‌'. భయంకరమైన కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడటానికి వ్యాక్సిన్‌ ఎలా కనిపెట్టారు? ఆ సమయంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ అయ్యాయి? వంటి ఆసక్తికర అంశాలతో దీని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రభాస్ సలార్​కు పోటీగా రానుందనే వార్త చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడా ప్రచారాన్నే నిజం చేస్తూ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ చేశారు అగ్నిహోత్రి. సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుందని కన్ఫామ్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్​ను కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్​లో పల్లవి జోషి, నానా పట్నేకర్ కనిపించారు. వ్యాక్సిన్ కోసం చేస్తున్న క్లీనికల్ ట్రయల్స్​ను చూపించారు. ఈ వీడియో ఇన్​టెన్సివ్​గా ఉంది.

అయితే ప్రభాస్‌ సినిమాతో వివేక్‌ అగ్నిహోత్రి తలపడటం ఇదేమీ కొత్తేం కాదు. గతంలో ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన 'రాధేశ్యామ్‌' మార్చి 11న విడుదల కాగా.. అదే రోజున 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'ను రిలీజ్‌ చేశారు వివేక్‌. కశ్మీరీ పండితులపై జరిగిన దాడుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించగా.. 'రాధేశ్యామ్‌' డిజాస్టర్​ టాక్​ను అందుకుంది.

Tags:    

Similar News