ప్రేమ రిలేషన్‌షిప్‌లో వైఫల్యాన్ని ఒప్పుకున్న స్టార్ హీరో
ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ తన గత సంబంధాల గురించి నిజాయితీగా మాట్లాడుతూ కనిపించాడు. సంబంధాల్లో వైఫల్యాలకు కారణాలను అతడు అన్వేషించాడు.
ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. అసాధారణ స్టార్ డమ్‌తో రాజులా వెలిగిపోతున్న ఓ ప్రముఖ హీరో 50 వయసులోను స్టిల్ బ్యాచిలర్ గానే మిగిలి ఉన్నాడు. తన కథానాయికలతో ఎఫైర్లు సాగించి పెళ్లి ప్రయత్నాలు సాగించినా కానీ చివరికి అతడి వివాహం ఒక కలలాగా మిగిలిపోయింది. అతడు పెళ్లాడాలనుకున్నాడు. సీరియస్‌గా ప్రయత్నాలు చేసాడు. కుటుంబాలను కలపాలని చూసాడు. కానీ ఏదీ ఫలించలేదు. ఒకసారి పెళ్లి శుభలేఖల వరకూ వచ్చి ఆగిపోయింది. ఒక ప్రియురాలు అతడి ప్రవర్తన దారుణంగా ఉంటుందని, తిట్టడం కొట్టడం వంటివి చేస్తాడని బహిరంగంగా మీడియా ముందు వాపోయింది. సదరు ప్రియురాలు ప్రపంచ సుందరి కావడంతో ఈ ఆరోపణలకు లోకం విస్తుపోయింది. అయితే ఈ ఎపిసోడ్ లో విఫల ప్రేమికుడు ఎవరు? అంటే కచ్ఛితంగా అది కండల హీరో సల్మాన్ ఖాన్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా దేశంలోని యువతుల మనసులను గాయపరిచిన అతడు ఎప్పటికీ బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. ఐశ్వర్యారాయ్, కత్రిన కైఫ్, సంగీత బిజిలానీ, సోమీ అలీ, లులియా వాంటూర్ వంటి భామలతో అతడు డేటింగులు చేసాడు. ఇంకా అంతగా బయటికి తెలియని పేర్లు ఉన్నాయి.
సల్మాన్ ఖాన్ డేటింగ్ లైఫ్ ఒకప్పుడు నిరంతరం వార్తల్లో ఉండేది. ముఖ్యంగా 90లలో 2000ల చివరి వరకు అతడి డేటింగ్ లైఫ్ గురించి నిరంతరం ప్రజలు చర్చించుకున్నారు. కాలక్రమేణా తాను ఎక్కడికో తప్పు దారిలో ఉన్నానని తన సంబంధాలు విఫలమవడం చూసినప్పుడే అర్థమైందని సల్మాన్ అంగీకరించాడు.
సల్మాన్ ఖాన్ స్వీయ-అవగాహన శాశ్వత సంబంధాలకు కీలకమని నొక్కి చెప్పాడు. ఆప్కీ అదాలత్ పాత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ తన గత సంబంధాల గురించి నిజాయితీగా మాట్లాడుతూ కనిపించాడు. సంబంధాల్లో వైఫల్యాలకు కారణాలను అతడు అన్వేషించాడు. ఇది అతని ఆత్మపరిశీలనను ఆవిష్కరించింది. ముఖ్యంగా స్వీయ-అవగాహన గురించి లౌకిక ఆలోచన గురించి సల్మాన్ ప్రస్థావించాడు. సల్మాన్ చెప్పినట్లుగా సంబంధం లో దీర్ఘాయువుకు స్వీయ అవగాహన అవసరం. ఇతరులతో సహజీవనంలోకి వెళ్లే ముందు మీలో మీకు నచ్చినవి.. ఇష్టపడని ఏమిటో వాటిని గుర్తించండి అని ఉన్నతమైన సలహాను ఇచ్చాడు సల్మాన్.
ఇటీవల త్రోబాక్ వీడియోలో సల్మాన్ ఖాన్ తన గత సంబంధాలను గుర్తుచేసుకున్నాడు. నింద తనపై ఉందని అంగీకరించాడు. అనేక మంది భాగస్వాములు తనను విడిచిపెట్టినందున తప్పు తనదే కావచ్చని అతడు గ్రహించాడు. సల్మాన్ తన భాగస్వాములను సంతోషపెట్టలేనని చివరికి భయపడ్డాడు. ఆ తర్వాత కాలక్రమేణా తప్పు తనదేనని గ్రహించి 'తప్పు నాదే' అని అన్నాడు. పలువురు కథానాయికలతో సంబంధాలు నిరాశాజనకంగా ముగియడం చూసిన తర్వాత ఆత్మ ఘోష అతనిని ప్రశ్నించింది. సల్మాన్ నెమ్మదిగా స్వీయవిమర్శకు ప్రయత్నించాడు. సల్మాన్ తాను చేసిన తప్పులకు బాధ్యత వహించాలని .. ప్రేమ ప్రతికూలతను కనుగొనడంలో తనలో సుముఖత ఎంత నిజాయితీగా ఉందో చూపించడానికి ప్రయత్నంచాడు. ఎవరితో అయినా మరింత సన్నిహితంగా, లోతైన సంబంధంలో ఉండాలనే కోరికను ప్రదర్శించాడు.
సల్మాన్ ఖాన్ తన ప్రవర్తనా విధానాలను విశ్లేషించుకున్నాడు. అతడు బంధానికి పూర్తిగా కట్టుబడి ఉండకపోవడం ఈ సంబంధాల ముగింపునకు కారణమై ఉండవచ్చని పేర్కొన్నాడు. అతడు తాను చేసిన దానికి బాధ్యత వహిస్తూ సల్మాన్ మానసికంగా ప్రస్తుతం చాలా ఎదుగుతున్నాడు. ప్రేమకు నిజమైన ఆధారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సికందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక మందన కూడా నటిస్తోంది. ఈ చిత్రం 2025 ఈద్‌కు విడుదల కానుంది.