మరోసారి కలువనున్న వెంకీ, సల్మాన్‌!

ఇప్పుడు సల్మాన్‌ తో ఉన్న సన్నిహిత్యం వల్ల ఈ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్ కి సల్మాన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు సోషల్ మీడియా వర్గాల్లో గుప్పుమంటున్నాయి.

Update: 2024-09-09 05:36 GMT

వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా పొల్లాచ్చి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అక్కడ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ పై కీలకమైన పాటను చిత్రీకరించినట్లు సమాచారం అందుతోంది. సగానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసిన దర్శకుడు దసరా కానుకగా టైటిల్‌ ను ప్రకటించడంతో పాటు వెంకటేష్ ఫస్ట్‌ లుక్ ను రివీల్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సమయంలో సినిమా గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో జరుగుతోంది. అదే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడట.

గత సంవత్సరం హిందీలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌' లో కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో వెంకటేష్ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన వెంకటేష్ నటించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. వెంకటేష్ ఆ సినిమాలో గెస్ట్‌ గా నటించినందుకు గాను ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్‌ గా నటించేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వెంకటేష్‌, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాలో సల్మాన్‌ గెస్ట్‌ గా కనిపించబోతున్నాడు.

సల్మాన్ ఖాన్‌ ఇంతకు ముందు టాలీవుడ్‌ మూవీ గాడ్‌ ఫాదర్‌ లో గెస్ట్‌ గా కనిపించాడు. చిరంజీవి పై ఉన్న అభిమానం, రామ్ చరణ్‌ తో ఉన్న స్నేహం కారణంగా ఆ సినిమాలో సల్మాన్‌ ఖాన్ గెస్ట్‌ గా కనిపించాడు. ఇప్పుడు సల్మాన్‌ తో ఉన్న సన్నిహిత్యం వల్ల ఈ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్ కి సల్మాన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు సోషల్ మీడియా వర్గాల్లో గుప్పుమంటున్నాయి. ఇప్పటి వరకు సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ గురించి దిల్‌ రాజు కాంపౌండ్‌ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు, అలాగే అనిల్ రావిపూడి కూడా ఈ విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు.

వచ్చే నెలలో సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో సినిమా కి సంబంధించిన అన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వడంతో పాటు, పుకార్లన్నింటికి చెక్‌ పెట్టే విధంగా స్పష్టత ను ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. దిల్ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు అనిల్‌ రావిపూడి తనదైన శైలిలో వినోదాత్మకంగా రూపొందిస్తున్నాడు. సోషల్‌ మీడియాలో ఇప్పటికే ఈ సినిమాకు విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయింది. సల్మాన్‌ ఖాన్‌ ఈ సినిమాలో నటిస్తాడనే పుకార్లు వస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. సంక్రాంతి సీజన్ కి సరిగ్గా సెట్‌ అయ్యే సినిమాగా మా సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి ఇటీవల ఒక చిట్‌ చాట్ లో చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News