గోల్డెన్ డ్రెస్ లో సామ్ గ్లామర్ మెరుపు
హీరోయిన్ సమంత.. ఇప్పుడు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
హీరోయిన్ సమంత.. ఇప్పుడు సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటించిన ఆ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరో రెండు రోజుల్లో అందుబాటులోకి రానుంది. దీంతో మేకర్స్ తో పాటు సామ్.. ఫుల్ గా సిరీస్ ను ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ముంబయిలో ఉంటూ సందడి చేస్తున్నారు సమంత.
వరుస ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. సిరీస్ పై అందరి ఫోకస్ పడేలా చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ సరదాగా గడుపుతున్నారు. ఆ సమయంలో అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు క్లియర్ కట్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు. సిటాడెల్ సిరీస్ మాత్రం తన కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని చెప్పి అంచనాలు పెంచారు సామ్.
అదే సమయంలో సిటాడెల్ ప్రీమియర్ ను తాజాగా ముంబైలో ప్రదర్శించారు మేకర్స్. ఆ వేడుకకు మెటాలిక్ గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించి హాజరయ్యారు సామ్. కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందరి దృష్టిని ఆకర్షించారు. సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న అమ్మడు.. తనదైన శైలిలో సందడి చేశారు. ప్రీమియర్ షోకు వచ్చిన సెలబ్రిటీలతో ముచ్చటించారు. అంతకుముందు తన క్రేజీ డ్రెస్ లో వేరే లెవెల్ లో పోజులు ఇచ్చారు సామ్.
అందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పిక్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సామ్ డ్రెస్సింగ్ సెన్స్ వేరే లెవెల్ లో ఉందని చెబుతున్నారు. పెర్ఫెక్ట్ గా డ్రెస్ సూట్ అయిందని అంటున్నారు. ఆమె స్కిన్ టోన్ కు సరైన రీతిలో మ్యాచ్ అయిందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సామ్ ఓ రేంజ్ లో బ్యూటిఫుల్ గా ఉన్నారని చెబుతున్నారు.
మేడమ్ సర్ మేడమ్ అంతే అని నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. సమంత అదరగొట్టేశారని చెబుతున్నారు. ఆమె కొత్త చిత్రాలకు లైక్స్ కొడుతూ తమ సోషల్ మీడియా వాల్స్ లో షేర్ చేస్తున్నారు. వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న సిటాడెల్ సిరీస్ తో సమంత ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.