విడాకుల టైమ్‌లో ఐటెం సాగ్‌.. కరెక్ట్‌ కాదన్నారు

అలాంటి ఐటం సాంగ్‌ ను చేసేందుకు సమంత ఫ్యామిలీ మెంబర్స్ నో చెప్పారట. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా స్నేహితులు మరియు సన్నిహితులు కూడా ఈ సమయంలో ఆ ఐటెం సాంగ్‌ అవసరం లేదు అన్నట్లుగా సూచించారట.

Update: 2024-06-07 10:30 GMT

టాలీవుడ్‌ తో పాటు పాన్‌ ఇండియా స్థాయి లో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న సమంత ఏడాది బ్రేక్ తర్వాత సినిమా షూటింగ్‌ కు హాజరు అవుతున్న విషయం తెల్సిందే. బంగారం అనే సినిమా కోసం వర్క్ చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే హిందీ వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఒక వైపు సినిమాలు మరో వైపు వెబ్‌ సిరీస్‌ లతో ఈ అమ్మడు ఇక ముందు బిజీ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని గురించి కామెంట్స్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో ఊ అంటావా పాటను సమంత చేసిన విషయం తెల్సిందే. ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. అన్ని భాషల్లో కూడా సమంత డాన్స్ కి ఫ్యాన్స్ అయిన ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు.

అలాంటి ఐటం సాంగ్‌ ను చేసేందుకు సమంత ఫ్యామిలీ మెంబర్స్ నో చెప్పారట. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా స్నేహితులు మరియు సన్నిహితులు కూడా ఈ సమయంలో ఆ ఐటెం సాంగ్‌ అవసరం లేదు అన్నట్లుగా సూచించారట.

విడాకుల గురించి చర్చలు జరుగుతున్న సమయంలో పుష్ప లో ఐటం సాంగ్‌ ను చేయడం ద్వారా విమర్శలు మరింత ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా మంది సమంతను హెచ్చరించారట. అయినా కూడా సమంత మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఆ పాట చేసింది. ఇప్పుడు కూడా తాను ఆ పాట చేసినందుకు ఫీల్‌ అవ్వడం లేదని, సంతోషంగానే ఫీల్‌ అవుతాను అంది.

Tags:    

Similar News