దూసుకెళుతున్న సమంత హెల్త్ పోడ్కాస్ట్
కొన్ని నెలల పాటు విశ్రాంతి తర్వాత తిరిగి నటనలోకి వస్తున్నట్లు సమంత ప్రకటించింది.
కొన్ని నెలల పాటు విశ్రాంతి తర్వాత తిరిగి నటనలోకి వస్తున్నట్లు సమంత ప్రకటించింది. ఉద్యోగం లేకుండా ఎంత భారంగా ఉంటుందో కూడా వెల్లడించింది. సమంత హెల్త్ పోడ్కాస్ట్ లో కొన్ని లైన్లు అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. సామ్ తదుపరి బాలీవుడ్ లోను నటించడానికి సిద్ధమవుతోందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఖుషి తర్వాత పూర్తిగా విరామం తీసుకున్న సమంతకు ఇది రైట్ టైమ్
తన పాడ్ కాస్ట్ లో వెల్నెస్ కోచ్ - పోషకాహార నిపుణుడు అల్కేష్ షరోత్రితో చాట్ సెషన్ లో పాల్గొంది. సమంత వ్యాఖ్యానిస్తూ... ``ఆరోగ్యం గురించి మాట్లాడటానికి... 20 తీసుకుందాం.. మొదటి వీడియో ఫిబ్రవరి 19న వస్తుంది. సామ్ & అల్కేష్తో #TAKE20 ..``అని వివరాలందించింది. సామ్ తన హెల్త్ పోడ్‌క్యాస్ట్ సెషన్ నుండి స్నిప్పెట్‌ను పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. సామ్ పాడ్ కాస్ట్ సారాంశం ఇలా ఉంది. ``నేను తిరిగి పనికి వెళ్తున్నాను.. చివరకు! కానీ ఇప్పటివరకూ నేను పూర్తిగా ఉద్యోగం లేకుండా ఉన్నాను. స్నేహితులతో కలిసి సరదాగా ఏదో చేస్తున్నాను. ఇది హెల్త్ పోడ్కాస్ట్. ఇది అస్సలు ఊహించనిది.. కానీ నేను నిజంగా ఇష్టపడే విషయమిది. నేను చాలా మక్కువతో ఉన్నాను`` అని సమంత ఎమోషనల్ గా ప్రకటించింది.సమంత నటించిన ఖుషి గత ఏడాది విడుదలైంది. కానీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ సమంత నటనకు అద్భుత స్పందన వచ్చింది. రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించిన సిటాడెల్ భారతీయ వెర్షన్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన సమంత తదుపరి ప్రచారానికి సిద్ధమవుతోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. ఇదేగాక సమంత పలువురు దర్శకనిర్మాతలతో చర్చలు జరుపుతోందని సమాచారం. తన తదుపరి ప్రాజెక్ట్‌ను త్వరగా ప్రకటించాలని భావిస్తోందిట. `ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2` సూపర్ సక్సెస్ తర్వాత హిందీ పరిశ్రమ నుండి చాలా ఆఫర్ లు వచ్చాయి. తాప్సీ నిర్మాణ సంస్థలో సమంత నటిస్తుందని కథనాలొచ్చాయి. అలాగే సల్మాన్ భాయ్ సరసన సమంత నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.