'మయోసైటిస్ ఇండియా' అంబాసిడర్‌గా సమంత
ఆటో ఇమ్యూన్ డిఫెక్ట్- మయోసైటిస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది సమంత. ఏడాది కిందట తన ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియాలో వెల్లడించిన సామ్ నాటి నుండి దీనికి చికిత్స పొందుతోంది.
ఆటో ఇమ్యూన్ డిఫెక్ట్- మయోసైటిస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది సమంత. ఏడాది కిందట తన ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియాలో వెల్లడించిన సామ్ నాటి నుండి దీనికి చికిత్స పొందుతోంది. దేశ విదేశాల్లో మయోసైటిస్ కి అత్యుత్తమ చికిత్స కోసం సమంత చాలా సమయాన్ని డబ్బును వెచ్చిస్తోందని కథనాలొచ్చాయి. అయితే తనకు వచ్చిన కష్టం ఇతరులకు రాకూడదని సమంత తలపోస్తోంది. అందుకే తన ఇబ్బంది గురించి ఇప్పుడు ప్రపంచానికి చెబుతూనే మయోసైటిస్ పై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. సామ్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. మైయోసైటిస్ గురించి అవగాహన పెంచే సంస్థ అయిన `మయోసిటిస్ ఇండియా`కు అంబాసిడర్ గా మారింది.
మైయోసిటిస్ ఇండియా అధికారిక సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతను నియమించినట్లు ప్రకటించింది. సమంత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు దాదాపు ఆరు నెలలుగా విశ్రాంతిలో ఉంది. మరో ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. త్వరలో మైయోసిటిస్‌కు ప్రత్యేక చికిత్సను వైద్యులు ప్రారంభిస్తారు. చికిత్స కోసం తన తల్లితో కలిసి దాదాపు రెండు నెలల పాటు అమెరికాలో ఉండాలని సమంత యోచిస్తోందని కథనాలొస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. తాజా ప్రకటనతో సమంతకు మరింత బాధ్యత పెరిగింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పుష్ప చిత్రంలో ఊ అంటావా పాటతో సామ్ వేవ్స్ క్రియేట్ చేసింది. సిటాడెల్ ఇండియా వెర్షన్ లోను సమంత నటించింది. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించారు. అలాగే విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. భార్యాభర్తల నడుమ గొడవల నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే చిత్రమిదని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలు వెల్లడిస్తున్నాయి.