సమంత.. అందరికి ఇచ్చిపడేసింది..

ఇక సమంత చాలా రోజుల తరువాత అన్ని రూమర్స్ కు ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అది కూడా చాలా సింపుల్ గా ఒక కొటేషన్ తో ఇచ్చి పడేసింది.

Update: 2024-08-15 06:28 GMT

సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కూడా కెరీర్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ భవిష్యత్తు ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు ఒక ప్లాన్ వేసుకుంటూ ముందుకు సాగుతోంది. రకరకాల రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు ఎప్పుడూ కూడా వాటిపై పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. ఇక గాసిప్స్ పుట్టుకొచ్చినప్పుడు కూడా సామ్ తన మౌనంతోనే బలమైన సమాధానం ఇస్తోంది.

 

జీవితానికి సంబంధించిన అనేక రకాల అంశాలపై సామ్ అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ ఇస్తూ ఉంటుంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం పలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్న సమంత ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది. అలాగే సోషల్ మీడియాలో తరచుగా తన ఉనికిని చాటుకునే విధంగా ఫొటోలు విడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. వీలైనంత వరకు అనవసరమైన గాసిప్స్ పైన పెద్దగా రియాక్ట్ కాదు.

అయితే ఇటీవల నాగచైతన్య - శోభితా దూళిపాల ఎంగేజ్మెంట్ తో మళ్ళీ ఒక్కసారిగా సమంత పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. సంబంధం లేని రూమర్స్ లో సమంత పేరును హైలెట్ చేయడం సామ్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదు. శోభితా చెల్లి పేరు కూడా సమంత అనే టాపిక్ ఒక రోజు ట్రెండ్ అవ్వగా, ఇప్పుడు సమంత ఒక దర్శకుడితో డేటింగ్ లో ఉందంటూ మరొక ఫేక్ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు.

ఇక సమంత చాలా రోజుల తరువాత అన్ని రూమర్స్ కు ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అది కూడా చాలా సింపుల్ గా ఒక కొటేషన్ తో ఇచ్చి పడేసింది. శాంతి మరియు నిశ్శబ్ద మ్యూజియం.. అనే కొటేషన్ ఉన్న టీ షర్ట్ ధరించిన ఆమె అనవసర రూమర్స్ ఎన్ని వచ్చినా ప్రశాంతంగా ఉండడమే బెటర్ అన్నట్లు మంచి కౌంటర్ ఇచ్చింది. సమంత చాలా పవర్ఫుల్ అని గతంలో చాలాసార్లు రుజువు చేసింది. ఇక ఈ సందేశం ఇస్తూ గాగుల్స్ తో మంచి గర్వంతో ఇచ్చిన స్టిల్ సూపర్బ్ అనేలా ఉంది.

తనకు నచ్చని విషయంలో చాలా పదునైన సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఇప్పుడు రూమర్స్ గురించి ఆమె పెద్దగా సీరియస్ అవ్వకుండా మౌనంగా ఉంటూనే ఇలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కెరీర్ మంచి ట్రాక్ లోనే కొనసాగుతోంది. సమంత ఫ్యాన్స్ కూడా ఆమె సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. అలాగే సొంత ప్రొడక్షన్ లోనే ఒక సినిమా చేస్తున్న సమంత ఒక హారర్ వెబ్ సీరీస్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Tags:    

Similar News