సమంత.. అల్ట్రా స్టైలిష్ లో ఘాటైన సొగసులు
ఇక ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. స్టైలిష్ గ్లామర్ డ్రెస్సులో అమ్మడు తన అందంతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలోనే తన మొదటి చిత్రం "ఏ మాయ చేసావే"తో మంత్రముగ్దులను చేసిన సమంత, సినీ పరిశ్రమలో 14 సంవత్సరాలుగా తన పట్టు కొనసాగిస్తోంది. మొదట్లో కమర్షియల్ సినిమాలు చేసిన ఆమె, ఇప్పుడు ఫిమేల్ సెంట్రిక్ చిత్రాలతో తన సత్తాను నిరూపిస్తోంది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న సమంత, ఇప్పుడు మళ్లీ తన కెరీర్లో నిలబడేందుకు సిద్దమవుతోంది.
మయోసైటిస్ వ్యాధితో కొన్ని నెలల క్రితం బారిన పడిన సమంత, విదేశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటూ, కొండల్లో, కోనల్లో విశ్రాంతి తీసుకుంది. ఈ సమయంలో ఆమె పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించింది. ఇటీవల భారత్‌కు చేరుకున్న సమంత, తిరిగి సినిమాలపై దృష్టిపెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫాలోవర్లతో ఎప్పటికప్పుడు పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ, వారి మనసులు గెలుచుకుంటోంది.
ఇక ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. స్టైలిష్ గ్లామర్ డ్రెస్సులో అమ్మడు తన అందంతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. మరికొన్ని ఫొటోలలో సింపుల్ మరియు అట్రాక్టివ్‌గా కనిపిస్తూ, తన లుక్స్ తోనే మాయ చేసేస్తోంది. ఇక ఆ పోటోలను చూసిన ఫాలోవర్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అల్ట్రా స్టైలిష్ అంటూ ఈ గ్లామర్ వరల్డ్ లో సమంతను కొట్టే వారే లేరు అంటున్నారు.
ఇక సమంత త్వరలోనే "సిటాడెల్" వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కోసం సమంత ఎంతో కష్టపడ్డారు. అలాగే, తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై "మా ఇంటి బంగారం" సినిమాను అనౌన్స్ చేసింది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. సమంత తన కెరీర్లో ఎన్నో మలుపులు చూసినప్పటికీ, తను తిరిగి నిలబడేందుకు ప్రయత్నిస్తున్నదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులతో, తన అభిమానం, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమె చురుగ్గా కనిపిస్తోంది.