స్టార్‌ హీరో మేనల్లుడి ఎంట్రీ... జోడీగా కాజల్‌

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్ ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడు అవార్డును సున్నితంగా తిరస్కరించడం ద్వారా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే

Update: 2025-01-25 10:30 GMT

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్ ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడు అవార్డును సున్నితంగా తిరస్కరించడం ద్వారా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. అవార్డులకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సుదీప్‌ చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం తనకు ఇచ్చిన గుర్తింపు, గౌరవంకు కృతజ్ఞతలు చెబుతూనే అవార్డును తిరస్కరించినందుకు గాను క్షమాపణలు చెప్పాడు. దాంతో గత రెండు రోజులుగా ఈ విషయం గురించే ప్రముఖంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన మేనల్లుడి సినిమా రంగ ప్రవేశం గురించి ప్రచారం మొదలైంది.

సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. గత ఏడాది కాలంగా సంచిత్‌ ట్రైనింగ్‌ తీసుకుంటూ రెడీ అవుతూ వచ్చాడు. ఇటీవలే సంచిత్‌ సంజీవ్‌ సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది. వివేక అనే దర్శకుడు సంచిత్‌ను హీరోగా కన్నడ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. తాజాగా ఈ సినిమాలో నటించబోతున్న నటీ నటులను ఎంపిక చేయడంతో పాటు సాంకేతిక నిపుణులను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో సంచిత్‌ సంజీవ్‌ కి జోడీగా కాజల్ కుందర్‌ ను ఎంపిక చేశారు. కాజల్‌ అనగానే సౌత్‌ ఇండియన్ ప్రేక్షకులకు ఎక్కువగా చందమామ కాజల్‌ గుర్తుకు వస్తుంది. కానీ ఈ కాజల్‌ వేరు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈమె ఈ మధ్య కాలంలో రాణిస్తుంది. కాజల్ అనే పేరు వల్ల ఈమెను ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చూస్తున్నారు. కాజల్‌ కుందర్ హీరోయిన్‌గా నటించనున్న నేపథ్యంలో సంచిత్‌ సినిమాకు అదనపు ఆకర్షణ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాబోయే రోజుల్లో ఈ అమ్మడు మన చందమామ కాజల్‌ స్థానంను భర్తీ చేసే రేంజ్‌లో ఆఫర్లు సొంతం చేసుకుంటుందనే అభిప్రాయంను కొందరు మీడియా వర్గాల వారు అంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంతో మంది వస్తూ ఉంటారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే పలువురు వారసులు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇతర భాషల్లో సక్సెస్ అయిన స్థాయిలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో సక్సెస్‌ కావడం లేదు అనేది టాక్. మరి సంచిత్‌ తన మామ వారసత్వంతో సక్సెస్‌లు దక్కించుకుని కన్నడ సినిమా రంగంలో మంచి ఆఫర్లు దక్కించుకుని స్టార్‌గా నిలుస్తాడా అనేది చూడాలి. సంచిత్‌తో చేయబోతున్న సినిమా హిట్ అయితే కాజల్‌ కుందర్‌ సౌత్‌లోని ఇతర భాషల్లోనూ మంచి సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుందా అనేది చూడాలి.

Tags:    

Similar News