'స్పిరిట్‌' లో ప్రభాస్ లుక్‌ ఫిక్స్‌..!

ప్రస్తుతం స్పిరిట్‌ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను దర్శకుడు సందీప్‌ వంగ తన టీం తో కలిసి ముంబై లో జరుపుతున్నాడు.

Update: 2024-09-21 01:30 GMT

సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఫౌజీ అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ రెండు సినిమాలను సమాంతరంగా చేస్తూ వెళ్తున్న ప్రభాస్ వచ్చే ఏడాది ఆరంభంలో సందీప్ వంగ దర్శకత్వంలో ఇప్పటికే కమిట్ అయిన 'స్పిరిట్‌' సినిమా షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంది. సందీప్‌ సినిమా ప్రారంభంకు ముందే రాజా సాబ్ సినిమా ముగించాలని ప్రభాస్ భావిస్తున్నాడు.

ప్రస్తుతం స్పిరిట్‌ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను దర్శకుడు సందీప్‌ వంగ తన టీం తో కలిసి ముంబై లో జరుపుతున్నాడు. స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయింది. డైలాగ్‌ వర్షన్‌ ను రాస్తున్నట్లుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో సందీప్ వంగ చెప్పుకొచ్చాడు. మరో వైపు నటీ నటుల ఎంపిక, సెట్స్ డిజైన్‌, హీరో, హీరోయిన్‌ ల లుక్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రభాస్‌ తో చేయబోతున్న స్పిరిట్ సినిమా కోసం సందీప్‌ వంగ చాలా ఎక్కువ వర్కౌట్‌ లు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం బట్టి అర్థం అవుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న తాజా సమాచారం ప్రకారం 'స్పిరిట్‌' లో ప్రభాస్‌ ను ఎలా చూపించాలి అనే విషయమై దర్శకుడు సందీప్‌ వంగ ఒక క్లారిటీకి వచ్చాడట. టెక్నాలజీని ఉపయోగించి దాదాపు వారం రోజుల పాటు వర్కౌట్స్ చేసి ప్రభాస్ స్పిరిట్‌ లో ఎలా అయితే బాగుంటుంది అనే విషయాన్ని కన్ఫర్మ్‌ చేశాడట. సినిమాలో ప్రభాస్‌ లుక్ కి ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఫిదా అయ్యేలా దర్శకుడు సందీప్‌ వంగ డిజైన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రభాస్ ను పోలీస్‌ ఆఫీసర్ గా దర్శకుడు సందీప్ వంగ చూపించబోతున్నాడట.

స్పిరిట్ లో ప్రభాస్ డ్యుయెల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు అనే పుకార్లు సైతం షికార్లు చేస్తున్నాయి. నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించే దర్శకుడు సందీప్‌ వంగ ఈసారి కూడా ప్రభాస్ సినిమాతో అందరి అటెన్షన్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సినిమాను ప్రారంభిస్తే విడుదలకు కనీసం ఏడాదిన్నర సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి రాజా సాబ్, ఫౌజీ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పిరిట్‌ సినిమాలతో పాటు ప్రభాస్ సలార్ 2, కల్కి 2 సినిమాల్లో నటించాల్సి ఉంది.

Tags:    

Similar News