రంగస్థలం మార్క్.. యానిమల్ మేకర్ స్టాంప్..!
సినిమా కథతో పాటు డైరెక్టర్ సాహిత్ సినిమా కూడా చూపించాడని.
పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ పాన్ ఇండియా రేసులో ఉంటూ సత్తా చాటుతుంటే కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యే చిన్న సినిమాలకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం అందట్లేదు. దీనికి కారణాలు ఎన్ని ఉన్నా సరే ఒక సినిమాను రిలీజ్ చేయడానికి చిన్న నిర్మాతలు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఐతే కొందరు మాత్రం తాము తీసిన సినిమాను ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడేలా చేస్తున్నారు. అలాంటి బజ్ తో వస్తున్న చిన్న బడ్జెట్ సినిమానే పొట్టేల్. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అర్జున్ రెడ్డి, యానిమల్ మేకర్ సందీప్ రెడ్డి వంగ అటెండ్ అయ్యారు.
సినిమా కథతో పాటు డైరెక్టర్ సాహిత్ సినిమా కూడా చూపించాడని. చిన్న సినిమా అని చెప్పాడు కానీ ఇది చాలా పెద్ద సినిమా అని అన్నారు సందీప్ వంగ. పెద్ద హృదయంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సినిమాలో నటించిన వారంతా బాగా చేశారని.. ఈ డైరెక్టర్ కి యూనిక్ స్టైల్ ఉందని అన్నారు. తనకు రంగస్థలం సినిమా చూసినప్పుడు ఎలాగైతే విలేజ్ సెటప్ అంతా నచ్చిందో ఆ తర్వాత ఇది కూడా అలానే అనిపించిందని అన్నారు సందీప్ రెడ్డి వంగ.
పొట్టేల్ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అనన్యా నాగళ్ల, అజయ్ ప్రధాన పాత్రలుగా నటించారు. సినిమా ఈవెంట్ కు వచ్చిన సందీప్ వంగ చిత్ర యూనిట్ ని ప్రోత్సహించేలా మాట్లాడారు. ఇక ప్రభాస్ హీరోగా తన డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ ఒక పోలీస్ స్టోరీ అని పలక మీద రాసి ఇచ్చారు సందీప్ వంగ. పొట్టేల్ లాంటి చిన్న సినిమాకు సందీప్ వంగ లాంటి డైరెక్టర్ ప్రోత్సాహం అందించడం నిజంగానే మంచి విషయమని చెప్పొచ్చు.
యానిమల్ మేకర్ గా పాన్ ఇండియా లెవెల్ లో పెను సంచలనాలు సృష్టించిన సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో స్పిరిట్ ని చేస్తున్నాడు. ప్రభాస్ రాజా సాబ్ పూర్తి చేయగానే స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సందీప్ లాంటి డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి రెబల్ హీరో దొరికితే ఎలా ఉంటుందో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా స్పిరిట్ ఉంటుందని చెబుతున్నారు.