విన్నారా? ‘యానిమ‌ల్’ డైరెక్ట‌ర్ కామెడీ మూవీ!

సందీప్ రెడ్డి వంగ సినిమాలంటే ఎలా ఉంటాయో అంద‌రికీ తెలుసు. త‌ను చెప్పాల‌నుకున్న ఎమోష‌న్ ని తెర‌పై చాలా బ‌లంగా చెప్ప‌గ‌ల ద‌ర్శ‌కుడు.

Update: 2023-11-30 08:42 GMT

సందీప్ రెడ్డి వంగ సినిమాలంటే ఎలా ఉంటాయో అంద‌రికీ తెలుసు. త‌ను చెప్పాల‌నుకున్న ఎమోష‌న్ ని తెర‌పై చాలా బ‌లంగా చెప్ప‌గ‌ల ద‌ర్శ‌కుడు. `అర్జున్ రెడ్డి`లో హీరో-హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ని ఎంత బ‌లంగా న‌డిపి స‌క్సెస్ అయ్యాడో తెలిసిందే. హీరో ప్రేమ‌ని ఓ సైకోయిక్ ప్రేమ‌గా తెర‌పై అద్భుతంగా చూపించాడు. టాలీవుడ్ ..బాలీవుడ్ లోనే ఇదో కొత్త జాన‌ర్ సినిమా రికార్డు సృష్టించింది.

స‌రిగ్గా అదే పాయింట్ ని బేస్ చేసుకుని ఇప్పుడు `యానిమ‌ల్` తోనూ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. ఇందులో తండ్రీ-కొడుకుల మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండింగ్ ని స‌న్ సైకోయిక్ గా ఆవిష్క‌రిస్తున్నాడు. మ‌నం కొడుకుని క‌న‌లేదు..క్రిమిన‌ల్ క‌న్నాం అంటూ అనీల్ క‌పూర్ డైలాగ్ తోనే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ని సందీప్ ఎంత బ‌లంగా చెప్ప‌బోతున్నాడో? అర్ద‌మైపోయింది. మ‌రి ఇలాంటి డైరెక్ట‌ర్ కామెడీ సినిమాలు చేస్తానంటే? న‌మ్ముతారా? అది ఆయ‌న‌కు సాధ్య‌మేనా? అంటే అంద‌రూ ఒక్క‌సారిగా ఆలోచ‌న‌లో ప‌డ‌తాం.

కానీ సందీప్ రెడ్డిలో ఆ యాంగిల్ కూడా ఉందంటున్నాడు. తన సాధారణ శైలికి భిన్నంగా కామెడీ ఫిల్మ్ మేకింగ్ రంగంలోకి ప్రవేశించాలనే కోరికను వ్యక్తం చేశాడు. సీరియ‌స్ చిత్రాల నుంచి ఎగ్జిట్ అయి ఇలాంటి సినిమాలు కూడా తీయాల‌ని ఉంద‌ని అన్నాడు. ఎప్పుడు చేస్తాడు ? అన్న‌ది రివీల్ చేయ‌లేదు గానీ వినోదం తో కూడిన సినిమాలు మాత్రం త‌ప్ప‌కుండా తీస్తాన‌ని ప్రామిస్ చేసాడు. మొత్తానికి సందీప్ లో యాక్ష‌న్ కాదు..కామెడీ కూడా ఉంద‌ని ప్రూవ్ చేయ‌బోతున్నాడు. మ‌రి అది టాలీవుడ్ లో చేస్తాడా? బాలీవుడ్ లో చేస్తాడా? అన్న‌ది చూడాలి.

డిసెంబ‌ర్ 1న `యానిమ‌ల్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు సందీప్. ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని ముగించారు. రిలీజ్ కి ఇంకా కొన్ని గంట‌లే స‌మ‌యం ఉండ‌టంతో అంతా ఎగ్జెట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అర్జున్ రెడ్డిని బ్రేక్ చేసేలా యానిమిల్ ఉంటుంద‌ని అంతా వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News