ఎడారిలో ఒంట‌రిగా సానియా ఏం చేస్తోంది?

తాజా ఫోటోషూట్ లో 37 ఏళ్ల సానియా ఎడారిలో అలా ఒంట‌రిగా నిల‌బడి ఫోజులిచ్చింది. ఒక సాధాసీదా క్యాజువ‌ల్ వేర్ లో సానియా సింపుల్ గా క‌నిపించింది.

Update: 2023-12-08 07:57 GMT

భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజా ఇన్‌స్టా పోస్టులు షాక్‌కి గురి చేస్తున్నాయి. సానియా విభిన్న‌మైన డిజైన‌ర్ దుస్తుల్లో ఒక బాలీవుడ్ క‌థానాయిక‌ను త‌ల‌పించ‌డ‌మే దీనికి కార‌ణం. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో సానియా స్టైలిష్ లుక్‌ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకునే ప్ర‌త్యేక‌మైన‌ ఫీడ్‌ను సానియా అందిస్తోంది.


అభిమానులు సానియా ఆకట్టుకునే డ్రెస్సింగ్ సెన్స్ కి సోష‌ల్ మీడియాల్లో లైక్ ల‌తో అభిమానం కురిపిస్తున్నారు. ఇప్పుడు సానియా స్వ‌దేశం పాకిస్తాన్‌లోని ప్రజలు త‌న‌ను ఎంతో అభినందిస్తున్నారు. ఎప్పటిలాగే సానియా తాజా పోస్ట్ అభిమానులను ఆకర్షించింది.

తాజా ఫోటోషూట్ లో 37 ఏళ్ల సానియా ఎడారిలో అలా ఒంట‌రిగా నిల‌బడి ఫోజులిచ్చింది. ఒక సాధాసీదా క్యాజువ‌ల్ వేర్ లో సానియా సింపుల్ గా క‌నిపించింది. మాజీ టెన్నిస్ స్టార్ తేలికపాటి మేకప్‌తో క‌నిపిస్తున్నారు. లైట్ కవరేజ్ ఫౌండేషన్ బుగ్గల పూత‌గా క‌నిపించ‌గా, లేత పెదవులకు నో లిప్ స్టిక్ లుక్ ని ఆపాదించింది. ఈ ఫోటో అప్‌లోడ్ చేసిన గంటలోపే వేలాది పైగా లైక్‌లు, కిక్ లు హోరెత్తాయి.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌తో వివాహం కారణంగా సానియా భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్‌లోను పాపుల‌రైంది. ఈ జంట 2010లో వివాహం చేసుకున్నారు. 5 ఏళ్ల కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ కు వారు త‌ల్లిదండ్రులు. అయితే అనూహ్యంగా గత ఏడాది విడాకుల పుకార్లు రావడంతో అది అభిమానులను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. అయితే సానియా లేదా షోయబ్ ఇప్పటివరకు విడిపోయామ‌ని లేదా క‌లిసే ఉన్నామ‌ని కానీ బహిరంగంగా ధృవీకరించలేదు. విడాకుల వార్త‌ల‌ను ఆ ఇద్ద‌రిలో ఎవ‌రూ తిరస్కరించక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

పాపుల‌ర్ బ్రాండ్‌ల‌కు ప్ర‌మోష‌న్:

NIVEA ఇండియా బ్రాండ్స్ లో NIVEA క్రీమ్ ఉత్ప‌త్లుల‌కు డిజిటల్-ఫస్ట్ క్యాంపెయిన్ `ది ఒరిజినల్, #TheOG`ని ప్రారంభించింది. కంపెనీ ఇప్ప‌టికే మాధురీ దీక్షిత్, గాయని శ్రేయా ఘోషల్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా నటించిన వీడియోలను ప్రదర్శిస్తుంది. నివియా ఉత్ప‌త్తుల‌కు సానియా లాంటి క్రీడాకారిణి ప్ర‌మోష‌న్ ల‌భించ‌డం ప్ర‌ధాన బ‌లం అని నివియా ఇండియా ప్ర‌తినిధి పేర్కొన్నారు.

Tags:    

Similar News