ఫోటో స్టోరి: బికినీలో సానియా

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌న‌దైన అందం, న‌ట ప్ర‌తిభ‌తో మ‌తులు చెడ‌గొట్టింది.

Update: 2024-09-14 16:30 GMT

బ్యాక్ గ్రైండ్ లో బ్లూ వాట‌ర్స్.. ర‌న్నింగ్ లో క్రూయిజ్ షిప్.. స‌ముద్ర‌పు అంచున కొండ‌ల‌పై అంద‌మైన భ‌వంతులు.. ఇలాంటి అద్భుత‌ నేప‌థ్యంలో అందాల క‌థానాయిక ఫోటోషూట్... ఇది ఒక లెవ‌ల్లో వ‌ర్క‌వుటైంది ఈ భామ‌కు. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇరుగ‌పాట్రులో న‌టించింది సానియా అయ్య‌ప్ప‌న్. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌న‌దైన అందం, న‌ట ప్ర‌తిభ‌తో మ‌తులు చెడ‌గొట్టింది. యువరాజ్ ధయలన్ రచన - దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. విక్రమ్ ప్రభు, శ్రద్ధా శ్రీనాథ్, విధార్థ్, శ్రీ, అబర్నతి, సానియా అయ్యప్పన్ ఇందులో నటించారు. 6 అక్టోబర్ 2023న థియేటర్లలో విడుదలైంది.


ఈ సినిమా స‌క్సెస్ త‌ర్వాత ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సానియా అయ్య‌ప్ప‌న్ వెంట‌పడుతున్నార‌ని స‌మాచారం. క్రేజ్ కి త‌గ్గ‌ట్టే ఈ బ్యూటీ స్వీయ‌ప్ర‌చారంలోను దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు టర్కీలోని బోడ్రమ్‌లోని ఎగ్జోటిక్ ల్యాండ్ లో విహరిస్తున్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి. క్రూయిజ్ షిప్ పై అందాల భామ‌ బ్రౌన్ అండ్ వైట్ బికినీలో అదిరిపోయే ఫోజులివ్వ‌గా అవ‌న్నీ వైర‌ల్ గా మారాయి. ముఖ్యంగా సానియా టోన్డ్ ఫిగర్ గుబులు పుట్టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ బికినీ షూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.


త‌దుప‌రి మోస్ట్ అవైటెడ్ `L2: ఎంపురాన్`లో ఈ భామ న‌టిస్తోంది. మల‌యాళ అగ్ర‌న‌టుడు, కంప్లీట్ హీరో మోహన్‌లాల్ ప్రధాన‌పాత్ర‌లో ది గ్రేట్ యాక్ట‌ర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌కు సానియా సంత‌కాలు చేసింద‌ని స‌మాచారం.

Tags:    

Similar News