సంజయ్ దత్.. తెలుగులో కూడా అదే రేట్లు

ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే వస్తున్నాయి. ఈ సినిమాల కోసం సంజయ్ దత్ 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట.

Update: 2023-12-10 04:29 GMT

బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు సంజయ్ దత్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన సంజయ్ దత్ హిందీతో పాటు ఇతర భాషలలో కూడా పవర్ ఫుల్ విలన్ పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ అయ్యారు. కేజీఎఫ్ 2లో అధీరా పాత్రతో ఒక్కసారిగా సంజయ్ దత్ అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్నారు.

ఆ సినిమా సంజయ్ దత్ కి సౌత్ నాట మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. దీంతో లియో మూవీలో విజయ్ కి విలన్ గా నటించే ఛాన్స్ అందుకున్నారు. కొడుకుని బలి ఇవ్వడానికి సిద్ధమైన తండ్రి అంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్ కనిపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో సంజయ్ దత్ ఎంట్రీ ఇస్తున్నారు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతోన్న డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సిద్ధం అవుతోన్న రాజా డీలాక్స్ మూవీలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే వస్తున్నాయి. ఈ సినిమాల కోసం సంజయ్ దత్ 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట.

సంజయ్ దత్ ని నార్త్ ఇండియాలో మంచి మార్కెట్ తో పాటు ఫాలోయింగ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని తమ సినిమాలకి హిందీలో మంచి బజ్ వస్తుందని దర్శక, నిర్మాతలు సంజయ్ దత్ ని తీసుకుంటున్నారు. అతని మార్కెట్ లెక్కల ప్రకారం అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుసస్తోంది.

మొత్తానికి బాలీవుడ్ వెటరన్ స్టార్స్ అందరూ ఇప్పుడు సౌత్ లోకి కూడా అడుగుపెడుతూ పాన్ ఇండియా లెవల్ లో తమ ఇమేజ్ పెంచుకుంటూ ఉండటం విశేషం. సంజయ్ దత్ తెలుగుతో పాటు కన్నడంలో కూడా ఓ భారీ బడ్జెట్ మూవీలో విలన్ గా నటిస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News