సంక్రాంతి టీమ్ కి ఐశ్వర్యా రాజేష్ సీక్రెట్ పార్టీ!
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ చాలా కాలం తర్వాత పడిన సోలో సక్సెస్ ఇది. ఈ సినిమా వెంకటేషన్ 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. ఇంత వరకూ వెంకీకి సోలోగా వంద కోట్ల సినిమా ఒక్కటీ లేదు. తన తరం హీరోలు చిరంజీవి, బాలయ్య లు సెంచరీలు కొడుతుంటే? వెంకీ మాత్రం వెనుకబడ్డారు. తాజా హిట్ తో వాళ్ల సరసన వెంకీ చేరిపోయారు.
దీంతో చిత్ర యూనిట్ కి వెంకటేస్ ప్రత్యేకంగా ఇంటికి పిలిచి పార్టీ కూడా ఇచ్చారు. ఈ పార్టీలే మహేష్ దంపతులు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. సక్సెస్ అయింది కాబట్టి నిర్మాత దిల్ రాజు కూడా మంచి పార్టీలు ఇస్తారు. అయితే ఇటీవలే చెన్నైలోనూ విజయోత్సవాన్ని యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ టీమ్ కి స్పెషల్ గా హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ కూడా పార్టీ ఇచ్చిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట జోరుగా ప్రచారమవుతోంది. ఐశ్వర్య రాజేష్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ అయిన తెలుగు సినిమా ఇది. ఇంతకు ముందు మూడు నాలుగు సినిమాలు చేసింది కానీ అవేవి పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. ఇందులో వెంకటేష్ ని `భా` అంటూ పిలిచి నటిగా వంద మార్కులు కొట్టేసింది. ఆమె పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ఐశ్వర్య కెరీర్ లో ఇంతవరకూ ఇలాంటి అప్లాజ్ ఏ చిత్రానికి రాలేదు.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కి పిలిచి మరీ గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.మీనాక్షి చౌదరి, చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఇలా అన్ని పాత్రలు సమపాళ్లలో పండటంతో ఇంత పెద్ద విక్టరీ నమోదు చేసింది. అందుకే వేగంగా సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఆ రకంగా వెంకీకి ఇది మరో రికార్డు. ఇప్పటికీ థియేటర్లు హౌస్ పుల్ అవుతున్నాయి. దూకుడు చూస్తుంటే? 300 కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.