సారా (X) సైఫ్: కూతురి క్రైమ్‌లో భాగస్వామి?
ఒకరు పోలీస్ గెటప్ లో బెదిరిస్తే, ఇంకొకరు ఖైదీ వేషంలోనే దడ పుట్టిస్తాడు.
అవును.. ఆ తండ్రి కూతురు నేరాల్లో భాగస్వామి. ఇద్దరూ మోసగాళ్లకు మోసగాళ్లు. ఏమార్చేయడంలో వీళ్ల తర్వాతే. ఒకరు పోలీస్ గెటప్ లో బెదిరిస్తే, ఇంకొకరు ఖైదీ వేషంలోనే దడ పుట్టిస్తాడు. ఇదిగో ఇక్కడ వీళ్లను చూస్తే మీకే అర్థమవుతుంది.
కొన్నిసార్లు పేరెంట్.. నేరంలో భాగస్వామి! .. అంటూ సారా అలీఖాన్.. పాపా సైఫ్ కోసం ఫాదర్స్ డే స్పెషల్ గా ట్విస్ట్ ఇచ్చింది. ఫాదర్స్ డే సందర్భంగా సారా ఇన్‌స్టా లో తన 'అబ్బా' కోసం అందమైన షాయారీ నోట్ రాసింది. కొన్నిసార్లు తల్లిదండ్రులు.. కొన్నిసార్లు నేరంలో భాగస్వామి! అని రాసింది.
స్నేహితుడు, ఫిలాసఫర్ & గైడ్- అబ్బా నువ్వు ఎప్పుడూ నావాడివే! అంటూ సైఫ్‌తో కలిసి ఉన్న కొన్ని అందమైన ఫోటోలను జోడించి పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. సైఫ్ తన కొడుకు ఇబ్రహీం నుండి క్యూట్ ఫాదర్స్ డే విష్ కూడా అందుకున్నాడు. ఇబ్రహీం తన అబ్బాతో తన చిన్ననాటి ఫోటో ఒకటి షేర్ చేసి ఇన్‌స్టాలో ఇలా రాసాడు. ''ఇప్పుడు..నీవు.. అప్పుడప్పుడు.. నా అబ్బాకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు''అని రాసాడు. తండ్రి సైఫ్ తో కలిసి సారా నటిస్తున్న సినిమా పబ్లిసిటీ స్టంట్ ఇది.
సైఫ్ గతంలో నటి అమృతా సింగ్‌ని అక్టోబర్ 1991లో వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2004లో విడిపోయారు. సారా -ఇబ్రహీంలకు వీరు తల్లిదండ్రులు. పెళ్లి చేసుకున్నప్పుడు సైఫ్ వయసు 21.. అమృత వయసు 33. ఇంత చిన్న వయసులో సైఫ్ ఎందుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారో కాఫీ విత్ కరణ్ షోలో ప్రశ్నించగా.. సైఫ్ ఇలా బదులిచ్చారు. ``ఇది ఒక కోణంలో ఇంటి నుండి పారిపోయినట్లు భావించాలి. నాకు చాలా విషయాలు గుర్తు లేవు.. నేను తర్వాత కనుగొన్నాను.. ఒక రకమైన భద్రత.. నేను దాంతో ఒక ఇంటిని తయారు చేయగలనని భావించాను`` అని అన్నారు. ఆ ఇద్దరి మధ్యా కొన్ని పోలికలున్నాయి. ఇద్దరూ చాలా ఫన్నీగా ఉండేవారు. ఎప్పుడు మాట్లాడుకునేప్పుడు చాలా నవ్వుకుంటూనే ఉంటారు. ఇతరులను అనుకరించడం, ఎవరినైనా ఫన్నీగా ఏడిపించడం.. తెలుసు. సైఫ్ మంచి మిమిక్రీ చేస్తాడు. ఆమె గొప్ప కథకురాలు..రచయిత... అందుకే వారు కలిసి చాలా సంతోషంగా ఉన్నారు! అని తెలిసింది. అయితే ఈ వివాహ బంధం కేవలం 13 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. అమృత నుండి తాను విడిపోయిన రోజును గుర్తుచేసుకుంటూ...తాను ఆమె నుండి విడిపోవాలనే తన నిర్ణయం గురించి మొదట తెలుసుకున్నది తన తల్లి షర్మిలా ఠాగూర్ అని సైఫ్ వెల్లడించాడు. అది చాలా సహాయపడిందని చెప్పాడు. ఇబ్రహీమ్ కు మూడేళ్ల వయసున్నప్పుడు విడిపోయానని తాను పిల్లల్ని కోల్పోయానని కూడా తెలిపాడు.
2012లో సైఫ్ తనకంటే పదేళ్ల చిన్నవయసులో ఉన్న కరీనా కపూర్ ని పెళ్లాడాడు. ఇద్దరు కుమారులు తైమూర్ - జెహ్‌లకు వీరు తల్లిదండ్రులుగా ఉన్నారు.