'సరిపోదా శనివారం'.. మంచి బేరమే..
ఏపీ, తెలంగాణ కలిపి సుమారు 25 కోట్లకు ఈ డీల్ జరిగినట్లు ఇన్సైడ్ వర్గాల ద్వారా సమాచారం.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన SVC సొంతం సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఏపీ, తెలంగాణ కలిపి సుమారు 25 కోట్లకు ఈ డీల్ జరిగినట్లు ఇన్సైడ్ వర్గాల ద్వారా సమాచారం. సినిమా రేంజ్ కి ఇది మంచి బిజినెస్ అని చెప్పాలి.
నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారు. యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో సినిమాకి ఖర్చు కూడా బాగానే అవుతుంది. ఇదిలా ఉంటే బిజినెస్ పరంగా ఇక్కడే డివిడి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలివైన వ్యూహాన్ని అనుసరించింది. అదేంటంటే, సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇతర భాషల డబ్బింగ్ రైట్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్.. ఇవన్నీ కలిపి ఎంత లేదన్న 100 కోట్ల వరకు వస్తుంది.
అంటే సినిమా బడ్జెట్ 60 నుంచి 70 కోట్ల దాకా వేసుకున్నా 20 కోట్లకు పైగా లాభం వచ్చినట్లే. ఎలాగూ సినిమా పై మంచి క్రేజ్ ఉంది. సినిమా సక్సెస్ అయినా కాకపోయినా పవర్ స్టార్ 'OG' సైతం ఇదే బ్యానర్ లో ఉండడంతో బయర్లు రేట్లు ఎక్కువ తక్కువ అయినా అంతగా ఆలోచించరు. ఇక దసరా, హాయ్ నాన్న వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నాని మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సరిపోదా శనివారం సెట్స్ లో తాజాగా ఎస్. జె సూర్య అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన చాలా వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వివేక్ ఆత్రేయ ఎస్. జె సూర్య కోసం ఒక డిఫరెంట్ విలన్ రోల్ ని డిజైన్ చేశారట. నాని - SJ సూర్య మధ్య ఉండే ఓ కాంప్లిక్ట్ పాయింట్ ని ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయలేదని అంటున్నారు.
దసరా లేదా దీపావళి టైమ్ కి సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయానికి ఏ సినిమా పోటీలో ఉంటుందో దాన్ని బట్టే మేకర్స్ నిర్ణయం తీసుకుంటారట. అందుకే ఇప్పటివరకు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు. 'గ్యాంగ్ లీడర్' తర్వాత మళ్లీ ఈ సినిమాతో నాని - ప్రియాంక మోహన్ జంటగా కనిపించబోతుండడంతో ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.