పాన్ ఇండియా సినిమాకి పని చేసినా కష్టం వృద్ధా!
రామ్ చరణ్-ఎన్టీఆర్ హీరోలగా రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన `ఆర్ ఆర్ ఆర్` పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
రామ్ చరణ్-ఎన్టీఆర్ హీరోలగా రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన `ఆర్ ఆర్ ఆర్` పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ విజయంతో ఇరువురు గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయ్యారు. హాలీవుడ్ లెజెండ్ జెమ్స్ కామెరూన్ సైతం ప్రశంసలు కురిపించారు. హీరోలిద్దరికీ హాలీవుడ్ అవకాశాలు సైతం వరించాయి. అలాగే సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డు కూడా వరించింది. ఇలా ఎన్నో రికార్డులు ఆర్ ఆర్ ఆర్ పేరిట ఉన్నాయి.
మరి ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటుడుడిగా ఫేమస్ అయిన సత్యదేవ్ కూడా నటించాడని ఎంత మందికి తెలుసు? అవును ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేసాడు. ఎంతో కష్టపడి `ఆర్ ఆర్ ఆర్` లో నటిస్తే సత్యదేవ్ సన్నివేశాల్ని ఎడిటింగ్ లో తీసేసారు. సినిమా లెంగ్త్ ఎక్కువ అవుతుందని అతడు నటించిన 16 నిమిషాల సీన్స్ ని తీసేసారు. ఈ విషయాన్ని ఆయనే తెలిపాడు. ఆ సినిమా కోసం దాదాపు పది రోజులు షూట్ లో పాల్గొన్నాడు.
మరి ఇంతవరకూ ఎందుకు చెప్పలేదు? అంటే చిత్రయూనిట్ పై ఉన్న గౌరవంతోనే ఎవరికీ చెప్పలేదన్నాడు. కానీ పదిరోజుల పాటు పనిచేయడం గొప్ప ఎక్స్ పీరియన్స్ ని అందించిందన్నాడు. సినిమాలెంగ్త్ ఎక్కువ అవుతుం దంటే? సినిమాలో కొన్ని సన్నివేశాల్ని ఎడిట్ చేయడం సహజం. కొన్నిసార్లు అనవసరం అనుకుంటే హీరోల సన్నివేశాల్నే ట్రిమ్ చేస్తుంటారు. ఇక `ఆర్ ఆర్ ఆర్` లో సత్యదేవ్ నటించాడు? అన్న విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ ఎక్కడా రివీల్ చేయలేదు.
అసలు అతడి పేరే బయటకు రాకుండా చూసుకున్నారు. ఎంత పనిచేయించుకుని పారితోషికం ఇచ్చేసినా? నటించాడు కానీ తప్పక సీన్స్ తీయాల్సి వచ్చిందని ఓ మాట చెబితే బాగుండేది. అది అతడికి గౌరవంగా ఉండేది. కానీ దర్శక, నిర్మాతలెవరూ అతడి పేరే బయటకు రానివ్వలేదని తెలుస్తోంది.