12రోజులు కోమాలో ఉంటే పవన్ మావయ్య అలా చేశాడు!
నా చెయ్యి పట్టుకుని నీకేం కాదురా అంటూ ధైర్యం చెప్పి వెళ్లేవారు.. అని సాయిధరమ్ తేజ్ గుర్తు చేసుకున్నారు.
సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారిగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలకపాత్రలో నటించిన 'బ్రో' ఈనెల 28న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సముదిరకని దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమా కథ విని ఓకే చెప్పిన కొద్దిరోజులకే సాయిధరమ్ తేజ్ అనూహ్యంగా బైక్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. తాజాగా ప్రీరిలీజ్ వేడుక లో ఇదే విషయాన్ని వెల్లడిస్తూ సాయిధరమ్ కొంత ఎమోషన్ కి గురయ్యాడు. ప్రమాదానికి ముందే తాను మావయ్య పవన్ కల్యాణ్ తో కలిసి ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నానని తెలిపారు.
తాను 12 రోజులు కోమా లో ఉంటే ప్రతి రోజు ఉదయం షూటింగుకి వెళ్లే ముందు నా దగ్గరకు వచ్చి మావయ్య వెళుతుండేవాడు. నా చెయ్యి పట్టుకుని నీకేం కాదురా అంటూ ధైర్యం చెప్పి వెళ్లేవారు.. అని సాయిధరమ్ తేజ్ గుర్తు చేసుకున్నారు. బ్రో మూవీ గురించి మాట్లాడుతూ.. అభిమానులంతా గర్వంగా కాలరెగరేసుకుని తొడకొడుతూ థియేటర్ నుంచి వెళతారు... బ్రో అంటూ కాలరెగరేస్తూ వెళతారని సాయిధరమ్ అన్నారు.
పీపుల్స్ మీడియా వారు వెంకీ మామ తీసారు. ఆ సినిమా కోసం మామ -అల్లుళ్లను కలిపారు. ఇప్పుడు బ్రో లో మళ్లీ మామ- మేనల్లుళ్లను కలిపారు. ఈ అవకాశం ఇచ్చిన సముద్రకనికి థాంక్స్. ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎలాంటి విజన్ ని అనుకున్నారో అలానే తీసారు. నా మావయ్య (గురువు) గారితో కలిసి నేను నటించాలనే ఆలోచన త్రివిక్రమ్ గారికి వచ్చింది. అందుకు థాంక్యూ సర్.. సినిమాటోగ్రాఫర్స్ మమ్మల్ని రియలిస్టిక్ గా చూపించారు.
మావయ్య నేను బయట ఎలా ఉంటామో అలానే తెర కోసం క్యాప్చుర్ చేసారు.నా గురువు గారు.. నా మావయ్య.. మా బ్రో.. నాకు ఈ ఛాన్సిచ్చారు థాంక్యూ వెరీ మచ్.. నేను ఈ స్టేజ్ మీదికి రావడానికి కారకులైన నా ముగ్గురు మావయ్యల కు ఎప్పుడూ తలొంచే ఉంటాను.. అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.