సెకండ్ వీక్ టాప్ రికార్డ్స్.. ఇక్కడ కూడా హనుమానే..
ఈ వీక్ లో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోతే ఈ నెల ఆఖరు వరకు హనుమాన్ ప్రభంజనం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకున్న మూవీ హనుమాన్. ఈ సినిమా రెండు వరాల తర్వాత కూడా అద్భుతమైన కలెక్షన్స్ ని సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కి రీచ్ అయిపొయింది. ఈ వీక్ లో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోతే ఈ నెల ఆఖరు వరకు హనుమాన్ ప్రభంజనం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఓవర్సీస్, నార్త్ ఇండియాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో రెండో వారంలో మంచి వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా హనుమాన్ నిలిచింది. సెకండ్ వీక్ లో హైయెస్ట్ షేర్ వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో హనుమాన్ టాప్ 3లో నిలవడం విశేషం. దీనికంటే ముందు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 మాత్రమే ఉన్నాయి. డిసెంబర్ లో వచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కూడా సెకండ్ వీక్ లో తెలుగు రాష్ట్రాలలో 18.88 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుంది.
అయితే హనుమాన్ మాత్రం రెండో వారంలో తెలుగు రాష్ట్రాలలోని ఏకంగా 27 కోట్ల షేర్ ని రాబట్టింది. దీనిని బట్టి సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో చెప్పొచ్చు. సెకండ్ వీక్ లో ఫ్యామిలీ ఆడియన్స్ గణనీయంగా పెరగడంతో వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. దీనికంటే ముందు 61.11 కోట్ల షేర్ తో ఆర్ఆర్ఆర్ టాప్ ప్లేస్ లో ఉంది. 40.28 కోట్ల షేర్ తో బాహుబలి 2 రెండో స్థానంలో నిలిచింది.
ఇక హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా సెట్స్ పైకి తీసుకొని వెళ్లే పనిలో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రంలో రానా హనుమంతుడి పాత్రలో నటిస్తాడనే మాట వినిపిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో రెండో వారంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితా ఇలా ఉంది.
ఆర్ఆర్ఆర్ - 61.11Cr
బాహుబలి 2 - 40.28Cr
హనుమాన్ - 27.00Cr*********
బాహుబలిi - 26Cr
ఆల వైకుంఠపురంలో- 25.52Cr
వాల్తేర్ వీరయ్య - 24.03Cr
సరిలేరు నీకెవ్వరూ - 21.80Cr
సర్కారువారిపాట - 18.88Cr
సైరా నరసింహారెడ్డి - 18.66Cr
ఎఫ్2- 17.69 Cr
రంగస్థలం - 14.52Cr