ఎన్టీఆర్ తో సెల్పీ..లక్కీ గాళ్!
ఆ మాట విని వెళ్లిపోతున్న తారక్ వెంటనే ఆగి ఆ అమ్మాయిని పిలిచి మరీ ఎంతో సంతోషంగా సెల్పీ ఇచ్చాడు. దీంతో ఆ లేడీ ఫ్యాన్ ఆనందానికి అవదుల్లేవ్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెల్పీ అంటే మాటలా? అదీ ఆయన ముందుకొచ్చి కమాన్ సెల్పీ దిగుదాం రా! అనడం చిన్న విషయమా? కానీ ఆ లక్కీ గాళ్ కి ఇది ఎంతో ఈజీగా జరిగిపోయింది. అవును మరి ఏంటి ఆమె లో స్పెషల్? పిలిచి మరీ తారక్ ఎందుకు సెల్పీ ఇచ్చాడు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ -2' షూటింగ్ లో భాగంగా ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తో పాటు భార్య ప్రణీత కూడా ఉన్నారు. ఇద్దరు సాయంత్రం సమయంలో హోటల్ కి వెళ్లి బయటకు వస్తుండగా అభిమానులు ఫోటోలు కోసం ఎగబడ్డారు.
అందులో ఓ లేడీ అభిమాని ఈ రోజు నా బర్త్ డే సార్.. మీతో ఫోటో దిగాలని ఉందని అడిగింది. ఆ సమయంలో ఆ లేడీ తారక్ కి దగ్గరగా ఉండటంతో అడగటం వీలు పడింది. ఆ మాట విని వెళ్లిపోతున్న తారక్ వెంటనే ఆగి ఆ అమ్మాయిని పిలిచి మరీ ఎంతో సంతోషంగా సెల్పీ ఇచ్చాడు. దీంతో ఆ లేడీ ఫ్యాన్ ఆనందానికి అవదుల్లేవ్. తారక్ పిలిచి మరీ ఫోటో ఇచ్చే సరికి తెగ మురిసిపోయింది. మనసులో నవ్వుని పెదాల పైకి తీసుకొచ్చి తన అభిమానమంతా చాటేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో తారక్ క్రేజ్ బాలీవుడ్ లో కూడా మాములుగా లేదని తెలుస్తుంది.
'వార్ -2' రిలీజ్ కి ముందే ఇలా ఉందంటే? హృతిక్ తో నటించిన 'వార్ -2' రిలీజ్ తర్వాత విధ్వంసం ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో తారక్ పాన్ ఇండియాలో పరిచయమైన సంగతి తెలిసిందే. తారక్ కెరీర్ లో అదే తొలి హిందీ రిలీజ్. అనువాద రూపంలో కూడా ఆయన సినిమాలేవి ఇంతవరకూ అక్కడ థియేటర్లలో రిలీజ్ కాలేదు. కానీ తొలి సినిమాతోనే బాలీవుడ్ లోనూ అభిమానుల్ని సంపాదించాడు. ఇప్పుడా క్రేజ్ ని రెట్టింపు చేయడం కోసం హిందీకి వెళ్తున్నాడు.
అలాగే తెలుగు లో కొరటాల శివ దర్శకత్వలో 'దేవర' చేస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మొదటి భాగం అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియాలో మొదటి భాగం సంచలనం అవ్వడం ఖాయమంటూ తారక్ ముందే హింట్ ఇచ్చేసాడు. ప్రతీ అభిమాని కాలరెగరేసాలా సినిమా ఉంటుందని ఉత్సాహం నింపాడు. దీంతో రిలీజ్ కోసం అభిమానులు అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.