మోక్ష‌జ్ఞ కోసం ఆ సీనియ‌ర్ నే దించుతున్నారా?

కొంత మంది వెట‌ర‌న్ న‌టీమ‌ణుల పేర్ల‌ను ప‌రిశీలించి చివ‌రిగా శోభ‌న అయితే ప‌ర్పెక్ట్ గా సూట‌వుతార‌ని ఆమెని సంప్ర‌దించారుట‌.

Update: 2024-10-16 12:31 GMT

నంద‌మూరి న‌ట వార‌సుడు బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ వ‌ర్మ లాంచింగ్ బాధ్య‌త‌లు తీసుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడు. బాల‌య్య ఏరి కోరి మ‌రీ ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ఎంతో న‌మ్మ‌కంతో తీసుకున్నారు. ఇప్పుడా న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాల్సిన బాధ్య‌త వ‌ర్మ‌పై ఉంది. దీంతో ప్ర‌శాంత్ వ‌ర్మ ప్రాజెక్ట్ విష‌యంలో ఎంతో ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

 

న‌టీన‌టులు దగ్గ‌ర నుంచి సాంకేతిక నిపుణుల వ‌ర‌కూ అంతా ది బెస్ట్ అందించే వారిని తీసుకుంటు న్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమాకి సంబంధించి ఓ అప్ డేట్ వైర‌ల్ అవుతుంది. ఈ సినిమాలో మోక్ష‌జ్ఞ త‌ల్లి పాత్ర అత్యంత కీల‌క‌మైన‌దిట‌. దీంతో ఆ పాత్ర‌కు బాగా పేరున్న సీరియ‌ర్ న‌టి అయితే బాగుంటుంద‌ని కొన్ని రోజులుగా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని బాల‌య్య దృష్టికి కూడా తీసుకెళ్లాడుట‌.

కొంత మంది వెట‌ర‌న్ న‌టీమ‌ణుల పేర్ల‌ను ప‌రిశీలించి చివ‌రిగా శోభ‌న అయితే ప‌ర్పెక్ట్ గా సూట‌వుతార‌ని ఆమెని సంప్ర‌దించారుట‌. ఇటీవ‌ల రిలీజ్ అయిన `క‌ల్కి 2898`లో కూడా శోభ‌న న‌టించారు. ఆమె చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన చిత్ర‌మిది. ఆ ర‌కంగా ఆమె మ‌రోసారి పాన్ ఇండియాలో ఓ వెలుగు వెలిగారు. ఈ నేప‌థ్యంలో శోభ‌న అయితే అన్ని ర‌కాలు గా క‌లిసొస్తుంద‌ని భావించి ఆమెని లాక్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఆమెను సంప్ర‌దించ‌డంతో పాజిటివ్ గా స్పందించారుట‌. బాల‌య్య‌తో శోభ‌న కొన్ని సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. 'నారి నారి నడుమ మురారి', 'మువ్వ గోపాలుడు' వంటి సినిమాల్లో శోభన నటించారు. అలా అప్పుడు బాల‌య్య తో ఇప్పుడు త‌న‌యుడితో శోభ‌న తెర‌ను పంచుకుంటున్నారు. ఒక‌వేళ శోభ‌న ఒప్పు కోక‌పోతే గ‌నుక ఆప్ష‌న్ గా సిమ్ర‌న్ ని కూడా అనుకున్నారుట‌. సిమ్ర‌న్ -బాల‌య్య కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాల గురించి తెలిసిందే.

Tags:    

Similar News