స్టార్ హీరోలు 16 సంవ‌త్స‌రాలుగా బ‌ద్ధ విరోధులు

ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా ద‌శాబ్ధంన్న‌ర‌ పైగానే ఆ ఇద్ద‌రు స్టార్ల‌ మ‌ధ్యా వైరం కొన‌సాగింది.

Update: 2023-09-04 03:15 GMT

ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా ద‌శాబ్ధంన్న‌ర‌ పైగానే ఆ ఇద్ద‌రు స్టార్ల‌ మ‌ధ్యా వైరం కొన‌సాగింది. మాట్లాడుకుని 16 సంవ‌త్స‌రాలైంది. ఎట్ట‌కేల‌కు ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత త‌మ శ‌త్రుత్వానికి ముగింపు ప‌లికారు. ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకున్నారు. భుజం భుజం రాసుకుపూసుకున్నారు. కౌగిలింత‌లు ముద్దులు క‌నిపించాయి. మొత్తానికి ప‌ల‌క‌రింపులు అయ్యాయి. చివ‌రికి వైరం ఎండ్ అయింది. ఈ అరుదైన దృశ్యానికి గ‌ద‌ర్ 2 స‌క్సెస్ వేదిక సాక్ష్యంగా నిలిచింది. ఇంత‌కీ ఎవ‌రా ఇద్ద‌రు స్టార్ హీరోలు? అంటే సీనియ‌ర్ స్టార్స్ షారూఖ్ ఖాన్.. స‌న్నీడియోల్.

సన్నీ డియోల్-షారూఖ్ ఖాన్ వారి 16 ఏళ్ల వైరాన్ని ఎట్టకేలకు ముగించారు. గదర్ 2 పార్టీలో కౌగిలింతలతో ఒక‌ట‌య్యారు. సన్నీ డియోల్ ఇటీవలే తన బ్లాక్‌బస్టర్ యాక్షన్ డ్రామా గదర్ 2 కోసం సక్సెస్ పార్టీని నిర్వహించాడు. ఈ వేడుకకు వచ్చిన అతిధులలో షారుఖ్ ఖాన్ ఒకరు. పార్టీనైట్ తన భార్య ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌తో కలిసి ఖాన్ ఈ ఘ‌న‌మైన‌ పార్టీకి హాజరయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు షేర్ చేసిన వీడియోలో, షారూఖ్ - సన్నీ డియోల్ ఎంతో స‌న్నిహితంగా క‌నిపించారు.

నిజానికి ఇది అరుదైన దృశ్యం. స్టార్లు ఇద్ద‌రూ ఒకరినొకరు పట్టుకుని వెచ్చని కౌగిలింతలతో వేదిక‌ను ఆహ్లాద‌ప‌రిచారు. ఈ వీడియోలో సన్నీ- SRK ఫోటోగ్రాఫ‌ర్ల వైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్ లు ఇవ్వ‌డం కనిపించింది. అక్క‌డ‌ షారూఖ్ సన్నీని పార్టీ వేదిక లోపలికి తీసుకెళ్లాడు. ఈ క్లిప్‌పై స్పందిస్తూ ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు. ``ఇద్దరినీ కలిసి చూడటం చాలా బాగుంది. ఇప్పుడు `డర్ 2` తెర‌కెక్కుతుంది``అని ఇన్‌స్టాగ్రామ్ లో రాసాడు. ఈ వేదిక వ‌ద్ద‌ షారుఖ్ ఖాన్ బూడిద రంగు జాకెట్ -నేవీ బ్లూ టీ-షర్టు, నల్లటి కార్గో ప్యాంట్ ధరించి కనిపించాడు. అయితే పోనీటైల్ హెయిర్ క‌ట్ తో స్పెష‌ల్ గా క‌నిపించాడు. సన్నీ బ్లాక్ టీ షర్ట్, బ్లూ బ్లేజర్లో స్మార్ట్ గా క‌నిపించాడు.

ఇంత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ ఏంటి?

షారుఖ్ - సన్నీ 1993లో `డర్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో కలిసి పనిచేశారు. ఇందులో జూహీ చావ్లా కూడా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో న‌టించిన క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్యా పొర‌పొచ్చాలొచ్చాయి. తరువాత సుదీర్ఘ వైరాన్ని కొన‌సాగించారు. దాదాపు 16 సంవత్సరాలుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.

తాను హీరోగా ఉన్నప్పుడు డర్‌లో షారుఖ్‌ పాత్రను ఎలా కీర్తించారనే దానిపై సన్నీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో గొడవ మొదలైంది. ఆప్ కీ అదాలత్‌లో ఆయన మాట్లాడుతూ- ప్రజలు నన్ను సినిమాలో ఇష్టపడ్డారు. వారు షారుఖ్ ఖాన్‌ను కూడా ఇష్టపడ్డారు. సినిమా విషయంలో నాకున్న ఏకైక సమస్య ఏమిటంటే వారు విలన్‌ని కీర్తిస్తారనేది నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఓపెన్‌ హార్ట్‌తో సినిమాల్లో పనిచేస్తాను. ఎదుటి వ్యక్తిని నమ్ముతాను. నమ్మకంతో పనిచేయడం నా నమ్మకం. దురదృష్టవశాత్తూ, ఈ పద్ధతిలో పనిచేయని చాలా మంది నటులు, న‌టీమ‌ణులు మనకు ఉన్నారు. బహుశా వారు తమ స్టార్‌డమ్‌ని పొందాలనుకునే మార్గం అదే కావచ్చు`` అంటూ షారూఖ్ ని టార్గెట్ చేసాడు.

ఇప్ప‌డు 16 సంవ‌త్స‌రాల త‌ర్వాత గ‌ద‌ర్ 2ని వీక్షించిన షారూఖ్ త‌న పాత మిత్రుడు స‌న్నీడియోల్ తో వైరానికి వీడ్కోలు ప‌లికాడు. డియోల్ ని స‌క్సెస్ పార్టీలో క‌లుసుకుని ఖుషీ చేసాడు. ప్ర‌ముఖ‌ జాతీయ మీడియాతో ఇటీవల ఇంటరాక్షన్‌లో సన్నీ డియోల్ మాట్లాడుతూ ఖాన్ త‌న‌ను ఎలా క‌లిసారు? అన్న‌దాని గురించి వెల్ల‌డించారు. ``షారుక్ ఖాన్ గ‌ద‌ర్ 2 సినిమా చూశాడు. అంతకు ముందు నాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. నేను కూడా సంతోషించాను. మీరు నిజంగా దానికి అర్హులు`` అని చెప్పారు. నేను ధన్యవాదాలు చెప్పాను. అప్పుడు నేను అతని భార్య (గౌరీ ఖాన్) , అతని కొడుకు (ఆర్యన్ ఖాన్)తో మాట్లాడాను.. అని తెలిపారు.

ఇది చాలా అందంగా ఉంది. నేను కూడా చాలా సార్లు షారూఖ్‌ని పిలిచాను. మేము కొన్ని విషయాలపై మా ఆలోచనలను పంచుకున్నాము అని స‌న్నీడియోల్ వెల్ల‌డించారు. గత సమస్యల గురించి మాట్లాడితే.. అవి ఏమైనప్పటికీ కాలం ప్రతిదీ నయం చేస్తుంది. మేము స్నేహంగా ముందుకు సాగుతాము. జీవితం ఇలాగే ఉండాలి.. అని కూడా స‌న్నీడియోల్ అన్నారు. ఏది ఏమైనా ఇద్ద‌రు మిత్రులు ఒక‌ట‌య్యారు. ఇప్పుడు డ‌ర్ 2 తీయాలి అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

నిజానికి షారూఖ్‌- స‌ల్మాన్ ఖాన్ ఒక‌రితో ఒక‌రు ద‌శాబ్ధాల పాటు వైరాన్ని కొన‌సాగించారు. కానీ ఈ వైరం వ‌ల్ల ఏదీ క‌లిసి రాలేదు. ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా ఎదిగినా కానీ సంచ‌ల‌నాల కోసం తిరిగి ఆ ఇద్ద‌రూ స్నేహితుల‌య్యారు. అనుకున్న‌ది సాధిస్తున్నారు. షారూఖ్ సినిమా ప‌ఠాన్ 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిందంటే దీనికి స‌ల్మాన్ ఖాన్ సాయం ఎంతో గొప్ప‌ది. ఇందులో అతిధి పాత్ర‌లో అత‌డు అద‌ర‌గొట్టాడు. ఇప్పుడు స‌ల్మాన్ కోసం టైగ‌ర్ 3లో షారూఖ్ అతిథిగా మెర‌వ‌బోతున్నాడు. ఇది సాయానికి ప్ర‌తిసాయం లాంటిది. యాక్ష‌న్ స‌న్నివేశంలో స్నేహితుల హంగామా విజిల్స్ వేయిస్తుంద‌ని టాక్. అలాంటి ఒక‌ గొప్ప మ్యాజిక్ ని షారూఖ్- స‌న్నీడియోల్ తిరిగి రీక్రియేట్ చేయాల‌ని స‌న్నీ అభిమానులు బ‌లంగా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News