వాళ్లిద్ద‌ర్నీ శంక‌ర్ స్పెష‌ల్ గా డిజైన్ చేసాడా?

ఆర్సీ 15 లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రోల్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్ప‌టికే లీకైంది.

Update: 2024-10-25 19:30 GMT

ఆర్సీ 15 లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రోల్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్ప‌టికే లీకైంది. ఐఏఎస్ ఆఫీసర్ యూనిఫాం తీసేసి రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఎలా ఉంటుంది? అన్న కోణంలో చ‌ర‌ణ్ పాత్ర‌ని స్టార్ మేక‌ర్ శంక‌ర్ డిజైన్ చేసి వ‌దులుతున్నాడు. ఒకే ఒక్క‌డు లో అర్జున్ రేంజ్ లో ఆరోల్ ఎంతో ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. గేమ్ ఛేంజ‌ర్ ఇండియాన్ పాలిటిక్స్ నే షేక్ చేసేలా ఉంటుంద‌ని ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

త‌న‌దైన మార్క్ సోష‌ల్ కాజ్ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఒకే మ‌రి మిగ‌తా పాత్రలు ఎలా ఉంటాయి? అంటే ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం తెలుస్తోంది. ఇందులో చార్మింగ్ స్టార్ శ్రీకాంత్..యువ న‌టుడు న‌వీన్ చంద్ర కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత‌వ‌ర‌కూ వాళ్ల పాత్ర‌లు ఎక్క‌డా హైలైట్ అవ్వ‌లేదు. శంక‌ర్

సినిమాలో వాళ్ల పాత్ర‌లంటే ఏవో సైడ్ క్యారెక్ట‌ర్లని అంతా అనుకుంటారు. కానీ కాద‌ని శ్రీకాంత్..న‌వీన్ చంద్ర ఇచ్చిన ఎలివేష‌న్ బ‌ట్టి తెలుస్తోంది.

షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో? ఇరువురు యూ ట్యూబ్ ల‌కు ఇస్తోన్న ఇంట‌ర్వ్యూలో త‌మ పాత్ర‌ల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లే చేస్తున్నారు. ఎవ‌రికి వారు ఎంతో కాన్పిడెంట్ గా ఈ పాత్ర‌ల‌పై క‌నిపిస్తున్నారు. శ్రీకాంత్..న‌వీన్ చంద్ర‌లు ఇలాంటి రోల్స్ లో అస్స‌లు ఊహించి ఉండ‌ర‌ని, ఆ రెండు పాత్ర‌ల్ని స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించిన‌ట్లు చెబుతున్నారు. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు ఏమాత్రం అంత‌ని విధంగా ఉంటాయ‌ట‌.

త‌మ కెరీర్ కి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చే పాత్ర‌లుగా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి వాళ్లు ఎలాంటి పాత్ర‌లు పోషిం చారు? అన్న‌ది తెలియాలంటే జ‌న‌వ‌రి వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే. ప్ర‌స్తుతం ఇద్ద‌రు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ సినిమాలో అవ‌కాశం రావ‌డం ఎంతో గొప్ప అనుభూతికి లోన‌వుతున్నారు.

Tags:    

Similar News