స్పైసీ లుక్స్ తో లవ్లీ బ్యూటీ.. స్టన్నింగ్!

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మరికొన్ని ఫోటోలు ఆమె స్టైల్‌కు, గ్రేస్‌కు ప్రత్యక్ష ఉదాహరణ.

Update: 2024-11-18 19:30 GMT

షాన్వి శ్రీవాత్సవ.. తన అందం, టాలెంట్ తో పాటు స్టైల్‌స్టేట్‌మెంట్‌తోనూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఎట్రాక్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మరికొన్ని ఫోటోలు ఆమె స్టైల్‌కు, గ్రేస్‌కు ప్రత్యక్ష ఉదాహరణ. బ్లాక్ కలర్ ట్రెండీ అవుట్‌ఫిట్‌లో షాన్వి తన గ్లామర్‌ అందాలను మరింతగా ఎలివేట్ చేస్తూ కనిపిస్తోంది. మొదటి ఫోటోలో షాన్వి నడుము వయ్యారాన్ని చూపుతూ కుర్రాళ్ల మనసులను దోచేస్తోంది.

ఆమె చుట్టూ ఉన్న లైటింగ్‌ డిజైన్‌తో కలగలిపి అందంగా మెరిసిపోతుంది. ఈ ఫోటోకి “గర్ల్స్ లైక్ టు బ్లింగ్” అనే క్యాప్షన్ షాన్వి ఫ్యాషన్‌పై తన ఆసక్తిని తెలియజేస్తుంది. రెండో ఫోటోలో మిర్రర్ సెటప్‌ను ఉపయోగిస్తూ ఆమె అందాన్ని కొత్త కోణంలో హైలైట్ చేసింది. ఈ ఫోటోలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ కూడా అద్భుతంగా ఉండటంతో ఆమె మరింత హైలెట్ అయ్యింది.

మూడో ఫోటోలో, మరింత హాట్ లుక్‌తో సరికొత్త డెఫినిషన్ ఇస్తోంది. ఆమె అవుట్‌ఫిట్‌ డిజైన్ మరియు సన్నని బంగారు గొలుసులు ఆమె లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి. షాన్వి కెరీర్ జర్నీ చూసుకుంటే 2012లో ‘లవ్లీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాన్వి, ఆ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలలో నటించినా, ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

కన్నడలో ఆమె చేసిన ‘మాస్టర్ పీస్’, ‘భజరంగీ 2’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. తన టాలెంట్‌తో పాటు గ్లామర్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో షాన్వి యాక్టివ్‌గా ఉంటూ తరచుగా గ్లామర్‌ ఫోటోషూట్లను షేర్ చేస్తుంటుంది. ఆమె ఫ్యాషన్ పిక్స్, ట్రెడిషనల్ లుక్స్, వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. షాన్వి ఇప్పుడు తనకు వచ్చిన మంచి అవకాశాలను మరింత పదును పెడుతూ కెరీర్‌లో ఎదిగే దిశగా ప్రయాణిస్తోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News