మనమే.. ఎలా ఉండబోతోంది..
విభిన్న కథలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసే దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య కి మంచి పేరుంది.
విభిన్న కథలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసే దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య కి మంచి పేరుంది. ఆయన తీసిన సినిమాలు మూడే అయిన కామెడీ టచ్ తో కథలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనమే మూవీతో జూన్ 7న శ్రీరామ్ ఆదిత్య ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనమే మూవీ కథాంశం చెప్పే ప్రయత్నం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చేస్తున్నారు. మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరామ్ ఆదిత్య మనమే కథ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఈ కథ మన మధ్యలో మన జీవితాలలో జరిగేది అని చెప్పారు.
సంభాషణలు కూడా నా జీవితంలో రెగ్యులర్ ఉపయోగించినవి ఉంటాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక అటాచ్మెంట్, భావోద్వేగాలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. మా నాన్నతో నాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అలాగే నాకు కొడుకు పుట్టిన తర్వాత కూడా మా అబ్బాయితో అదే అటాచ్మెంట్ ఏర్పడింది. పిల్లల పెంపకంలో ఓ విధమైన సరదా వాతావరణం ఉంటుంది. అలాగే తెలియని ఉద్వేగం దాగి ఉంటుంది.
వాటిని తెరపై దృశ్యరూపంలో చూపించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. మనమే మూవీలో అలాంటి ఎలిమెంట్స్ అన్ని తెరపై చూపించబోతున్న. ప్రతి ఒక్కరు ఈ సినిమాకి కచ్చితంగా రిలేట్ అవుతారని శ్రీరామ్ ఆదిత్య చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కి కాస్త కామెడీ జోడించి హీరో, హీరోయిన్, చంటి పిల్లాడికి ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
మూవీలో శర్వానంద్, కృతి శెట్టి రోల్స్ టామ్ అండ్ జెర్రీ తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. శర్వానంద్ ఒకే ఒక్క జీవితం మూవీతో రెండేళ్ల క్రితం సూపర్ హిట్ కొట్టారు. ఆ కథ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కినదే కావడం విశేషం. అయితే ఈ సారి ఒక చిన్న పిల్లాడి చుట్టూ ఎంటర్టైన్మెంట్ జోడించి చెప్పే ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అవుతున్నారు.