ఏంటి శర్వా.. టైటిలే ఇంత చప్పగానా?

యంగ్ హీరో శర్వానంద్ ఈ మధ్యకాలంలో వరుస డిజాస్టర్స్ కారణంగా కెరియర్ పరంగా స్పీడ్ తగ్గింది. అయితే ఒకే ఒక జీవితం మూవీతో ఈ ఏడాది సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.

Update: 2023-10-25 17:13 GMT

యంగ్ హీరో శర్వానంద్ ఈ మధ్యకాలంలో వరుస డిజాస్టర్స్ కారణంగా కెరియర్ పరంగా స్పీడ్ తగ్గింది. అయితే ఒకే ఒక జీవితం మూవీతో ఈ ఏడాది సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో మళ్ళీ డిఫరెంట్ కంటెంట్ లతో కథలు చేయడానికి రెడీ అయిపోయాడు. అందులో భాగంగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒక మూవీ చేస్తున్నాడు.

శర్వానంద్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండటం విశేషం. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రం కోసం అనుక్న్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి బేబీ ఆన్ బోర్డు అనే టైటిల్ ముందుగా పెట్టారు. అయితే ఈ టైటిల్ పెద్దగా కనెక్ట్ అవ్వదనే ఉద్దేశ్యంతో మనమే అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మనమే అనే టైటిల్ బాగానే ఉన్న కూడా మాస్ ఆడియన్స్ కి పెద్దగా రీచ్ కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. నిర్మాతలు కూడా అదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారంట. దీంతో ఈ టైటిల్ కూడా ఇప్పుడు హోల్డ్ లో పడే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు డార్క్ కామెడీ నేపథ్యంలోనే ఉంటాయి.

ఇప్పుడు శర్వానంద్ తో చేయబోయే సబ్జెక్ట్ కూడా ఇంచు మించు అలాగే ఉంటుందనే మాట వినిపిస్తోంది. అయితే బడ్జెట్ పరంగా ఇప్పుడు స్పేస్ దొరకడంతో కాస్తా గ్రాండ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు.

అయితే శర్వానంద్ మార్కెట్ కి మించి ఈ సినిమాకి ఖర్చు చేస్తూ ఉండటం, అలాగే ప్రస్తుతం ఫిక్స్ చేసిన టైటిల్ కూడా మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా లేకపోవడం, కాస్తా టెన్షన్ పెడుతున్నాయి. మరి ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News