కన్నడ నటి సూసైడ్ నోట్ లో సంచలన విషయం!?

ఈ సమయంలో ఆమె సూసైడ్ నోట్ దొరికిందని, అందులో కీలక విషయం ఉందని అంటున్నారు!

Update: 2024-12-02 07:12 GMT

హైదరాబాద్ గచ్చిబౌలిలో బుల్లితెర నటి శోభిత (32) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్థానిక శ్రీరాం నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో తన భర్తతో కలిసి నివాసమంటున్న శోభిత.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమయంలో ఆమె సూసైడ్ నోట్ దొరికిందని, అందులో కీలక విషయం ఉందని అంటున్నారు!

అవును... బుల్లితెర నటి శోభిత గచ్చిబౌలిలోని ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే! నవంబర్ 30 రాత్రి భర్తకు ఆఫీసు వర్క్ ఎక్కువగా ఉండటంతో.. వేరే గదిలో పడుకునేందు వెళ్లగా.. ఉదయం సమయంలో ఎంత పిలిచినా డోర్ తీయలేదని.. అనుమానం వచ్చి డోర్ బద్దలు కొట్టిన భర్తకు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిందని చెబుతున్నారు.

దీంతో.. తన దగ్గరి బంధువు, అపార్ట్మెంట్ ఓనర్ కు ఫోన్ చేయగా.. హుటాఉటిన ఘటనా స్థలికి చేరుకుని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారని అంటున్నారు. దీంతో... వెంటనే ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేస్కున్నారని అంటున్నారు.

ఘటనా స్థలంలో దొరికినట్లు చెబుతున్న ఆ సూసైడ్ నోట్ లో "మీరు చావాలనుకుంటే యు కెన్ డూ ఇట్!" అని రాసి ఉందని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో... నటి శోభిత మృతికి భర్తతో విభేదాలు కారణమా.. లేక, డిప్రెషన్ కారణమా.. అదీగాక, యాక్టింగ్ కు దూరమవ్వడమే కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారని అంటున్నారు.

కాగా... మ్యాట్రిమోన్ లో శోభిత ప్రొఫైల్ చూసిన సుధీర్ రెడ్డి మ్యారేజ్ ప్రపోజల్ చేశారని.. వివాహం తర్వాత సీరియల్స్ లో నటించడం మానేసినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. అయితే.. అది ఆమె ఇష్టప్రకారమే మానేశారా.. లేక, భర్త బలవంతమా అనేది తెలియాల్సి ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో... ఆత్మహత్యకు ముందు శోభిత ఎవరెవరితో మాట్లాడింది అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాని కుటుంబ సభ్యులు బెంగళూరు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది!

Tags:    

Similar News