మినీ స్క‌ర్ట్ లో మురిపించిన క‌పూర్ బ్యూటీ!

రెడ్ కార్పెట్ ని మ‌రోసారి హీటెక్కించింది. కార్పెట్ పై ఎంత మంది భామ‌లు వాక్ చేసినా? క‌పూర్ బ్యూటీని కొట్టే వాళ్లు లేనంత‌గా అల‌రించింది.

Update: 2024-11-30 20:30 GMT

ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో శ్ర‌ద్దా క‌పూర్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ప్ర‌తీసారి సంథింగ్ స్పెష‌ల్ డిజైన‌ర్ దుస్తుల్ని ఎంపిక చేసుకుని హైలైట్ అవుతుంది. అదే డిజైన్ లో త‌న‌దైన మార్క్ హీటెక్కించే అందాల్ని అమ్మ‌డు అంతే హైలైట్ చేస్తుంది. తాజాగా అమ్మ‌డు గత రాత్రి జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ 2024 ఈవెంట్‌కు హాజ‌రైంది. రెడ్ కార్పెట్ ని మ‌రోసారి హీటెక్కించింది. కార్పెట్ పై ఎంత మంది భామ‌లు వాక్ చేసినా? క‌పూర్ బ్యూటీని కొట్టే వాళ్లు లేనంత‌గా అల‌రించింది.

న‌లుపు రంగు మినీ స్క‌ర్ట్ లో అమ్మ‌డు త‌ళుకులీనింది. ఆఫ్-ది-షోల్డర్ బ్లాక్ దుస్తుల్లో మురిపించింది. వంద‌శాతం ఒరిజిన‌ల్ నూలుతో త‌యారు చేసిన దుస్తులివి. మినీ-లెంగ్త్ ఎంసెట్‌లో ప్లంగింగ్ నెక్‌లైన్, స్లీవ్‌లెస్ ఆఫ్-షోల్డర్ పట్టీలు, హిప్ వద్ద డబుల్ డార్ట్ , ఫిగర్-హగ్గింగ్ సిల్హౌట్ డ్రెస్ డిజైన్ ని మరింత హైలైట్ చేసాయి. అమ్మ‌డి హైట్ ని మ్యాచ్ చేస్తూ ఎంతో ప‌క్కాగా డిజైన్ చేసారు. క్రిస్టియన్ లౌబౌటిన్ నుండి బ్లాక్ అండ్ వైట్ హీల్డ్ బూట్‌లను ఎంచుకుంది.

జిమ్మీ చూ నుండి క్రిస్టల్ హార్ట్-షేప్ బ్యాగ్ - స్టేట్‌మెంట్ గోల్డ్ హూప్ చెవిపోగుల్లో మ‌రింత అందంగా ఎలివేట్ అయింది. బోల్డ్ స్మోకీ ఐ షాడో క‌నుబొమ్మ‌ల్ని మిరంత అందంగా తీర్చిదిద్దింది. పెదాల‌కు లేత గులాబీ రంగు లిప్ స్టిక్ ఎంపిక చేసుకుంది. మొత్తంగా శ్ర‌ద్దా క‌పూర్ అలంక‌ర‌ణ వావ్ అనిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. మ‌రి ఈ డిజైనర్ దుస్తుల ఖ‌రీదు ఎంత అంటే? డేవిడ్ కోమా డ్రెస్ ధర ₹1,69,600. దీనిని ఆఫ్ ది షోల్డర్ వూల్ మినీ డ్రెస్ అని పిలుస్తారు.

ఇక శ్ర‌ద్దా క‌పూర్ ఇటీవ‌లే స్త్రీ-2తో భారీ విజ‌యం న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా 800 కోట్ల వ‌సూళ్ల‌తో లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో స‌రికొత్త చ‌రిత్ర రాసింది. ఉమెన్ సెంట్రిక్ చిత్రాల ప‌రంగా ఈ రికార్డును ఇప్ప‌ట్లో కొట్ట‌డం అసాధ్యం.

Tags:    

Similar News