డాటర్ ని చూసి డాడీకి బోర్ కొట్టేసిందా?
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్ కెరీర్ ఒక్కసారిగా స్లో అయిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలు అమ్మడిని రేసులో నెమ్మదించేలా చేసాయి.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్ కెరీర్ ఒక్కసారిగా స్లో అయిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలు అమ్మడిని రేసులో నెమ్మదించేలా చేసాయి. మూడేళ్లగా శ్రద్దా నుంచి ఏడాదికో సినిమా తప్ప! రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది లేదు. `సాహో`తో తెలుగులోనూ కనిపించినా అటుపై ఇక్కడా అవకాశాలు రాలేదు. అందం..అభినయం కలిగిన కపూర్ బ్యూటీ అయినా ఎందుకనో టాలీవుడ్ లో ప్రోత్సాహం కనిపించలేదు.
మొత్తగా చూస్తే జాన్వీ కపూర్...అలియాభట్ రేంజ్ లో శ్రద్దా కపూర్ స్పీడ్ అయితే లేదనే చెప్పాలి. కొంత కాలంగా అమ్మడు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. బాలీవుడ్ భామలంతా పోటీపడి మరీ అందాల విందు చేస్తుంటే కపూర్ వారసురాలు మాత్రం కామ్ గా ఉంటుంది. దీంతో అమ్మడు దృష్టంగా బ్రాండింగ్స్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలకన్నా వాటి ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందా? అన్నది తెలియదు గానీ వాటితోనే బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం అమ్మడు అజియో సేల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పండగ స్పెషల్ సేల్ ఎక్కడ కనిపించినా శ్రద్దా కపూర్ అందులో కనిపిస్తుంది. మరి కూమార్తెని ఇలా చూసి చూసి తండ్రి శక్తి కపూర్ కి బోర్ కొట్టిందో ఏమో గానీ... అజియో సేల్స్ యాడ్ మీద స్పందించాడు. ప్రతీసారి ఇదే యాడ్ లో నా కుమార్తెని ఎందుకు చూపిస్తా అడ్మిన్ బేటా? అని శక్తి కపూర్ ఇన్ స్టాలో అడిగారు. దానికి అజియో రిప్లై ఇచ్చింది.
అలా ఎందుకంటే అంటూ.. ఆమెతో పాటుగా ఇండియా మొత్తాన్ని తన వెంట తీసుకొస్తుంది కాబట్టి అని రిప్లై ఇచ్చారు. దానికి బధులుగా శక్తి కపూర్ ఆమెనిఈ భూమ్మీదకు ఎవరు తీసుకొచ్చారు? అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఇలా శక్తి కపూర్ ఇన్ స్టాలో చేసిన సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పుడీ కాన్వర్జేషన్ నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఇక శక్తికపూర్ కూడా వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.