శ్రుతిహాసన్‌లో పరవళ్లు తొక్కిన ఆనందం
తాజాగా సలార్ మరపురాని క్షణాలను ప్రతిబింబిస్తూ శ్రుతి తన టీమ్ తో హృదయపూర్వక ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేసింది.
సలార్ 500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. తొలివారం ముగిసేప్పటికి ఈ ఫీట్ సాధ్యమైంది. మొదటి రోజు అజేయంగా 175 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తొలి వీకెండ్ హవా సాగించి, వారాంతానికి చక్కని ఫలితాన్ని రాబట్టింది. ఈ ఆనందాన్ని ప్రభాస్- ప్రశాంత్ నీల్ బృందంతో పాటు, శ్రుతిహాసన్ కూడా దాచుకోలేకపోతోంది.
తాజాగా సలార్ మరపురాని క్షణాలను ప్రతిబింబిస్తూ శ్రుతి తన టీమ్ తో హృదయపూర్వక ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో కొన్ని ఆన్ లొకేషన్ ఫోటోలను షేర్ చేసి, సలార్ విశేషమైన మైలురాయిని చేరుకోవడంతో తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లింది. `SALAAR జ్ఞాపకాలు` అని క్యాప్షన్ ఇస్తూ.. తనతో కలిసి పని చేసిన అద్భుతమైన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
అద్భుతమైన వ్యక్తులు.. కాంతి సానుకూలతతో నిండిన వ్యక్తులు అంటూ అభివర్ణిస్తూ సినిమాను రూపొందించే క్రమంలో అనుభవాలను శ్రుతి గుర్తు చేసుకుంది. తనకు అన్నివిధాలా సహకరించిన శ్రద్ధ వహించినందుకు ప్రభాస్..కు, చిత్రీకరణలో రేసింగ్ క్రికెట్ మ్యాచ్‌ల మధ్య వినోదం పంచినందుకు ప్రశాంత్ సర్‌ని తనతో మొత్తం మ్యూజిక్ వీడియోను రూపొందించినందుకు భువన్ సర్‌ని ప్రత్యేకంగా ప్రస్థావిస్తూ ధన్యవాదాలు తెలియజేసింది. మంచి వ్యక్తులు విజయాన్ని సాధించడానికి సాక్ష్యమిది అని అన్నారు. ప్రతి సన్నివేశంలో స్నేహబంధం, నవ్వు కృషిని ప్రేమ అని పేర్కొంది. ప్రశాంత్ నీల్ గురించి చెబుతూ ``పిచ్చి గంభీరమైన ప్రపంచం``లో భాగమైనందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మొత్తం బృందానికి కృతజ్ఞతలు తెలియజేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రికెట్ ఆడుతున్న షాట్ లు..సూర్యోదయాన్ని ఆస్వాధిస్తున్న క్షణాలు.. గనిలో గంభీరమైన ప్రదేశం వీక్షణ.. షాట్‌లు ఇవన్నీ ఫీడ్ లో ఉన్నాయి. ఇంతటి అంకితభావం టీమ్ లో ఉంది గనుకే సలార్ నేడు ఘనవిజయం సాధించింది. 2024లో శ్రుతి పలు భారీ చిత్రాల్లో నటించనుంది. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని సమాచారం.