శృతి హాసన్.. మరొకటి కూడా పాయే..

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చాలా తొందరగానే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది.

Update: 2024-10-25 16:30 GMT

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చాలా తొందరగానే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే ఆమె గత కొన్నేళ్లుగా సినిమాల విషయంలో ఎందుకనో ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది. చివరిగా ‘సలార్’ మూవీలో కనిపించింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఆమె ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాలేదు. నిజానికి ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ మూవీలో శృతి హాసన్ నటిస్తోంది.

సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తెలుగులో అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘డెకాయిట్’ మూవీలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేశారు. డెకాయిట్ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ‘డెకాయిట్’ మూవీ నుంచి ఆమె తప్పుకుంది. షూటింగ్ ఆలస్యం కావడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేక డెకాయిట్ నుంచి తప్పుకుందనే ప్రచారం నడిచింది.

ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా నుంచి కూడా శృతి హాసన్ తప్పుకునుంది. ఇండో-ఆంగ్లో బేస్డ్ ప్రొడక్షన్ లో ‘చెన్నై స్టోరీ’ అనే సినిమాకి గతంలో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాని సమంత చేయాల్సింది. అయితే ఆమె మాయోసైటిస్ బారిన పడటంతో ‘చెన్నై స్టోరీ’ ప్రాజెక్ట్ ని వదులుకుంది. దీంతో ఈ మూవీలో మెయిన్ లీడ్ కోసం శృతి హాసన్ ని కన్ఫర్మ్ చేశారు. ఎందుకనో సడెన్ గా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందని తెలుస్తోంది.

కారణాలు ఏంటనేది అయితే బయటకి రాలేదు. ‘చెన్నై స్టోరీ’ సినిమా శృతి చేయడం లేదనే విషయం తెలుస్తోంది. ఆమె తప్పుకోవడంతో ఇప్పుడు ఈ చిత్రం కోసం వేరొక హీరోయిన్ ని తీసుకునే పనిలో మేకర్స్ ఉన్నారు. ఇలా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని అయితే శృతి హాసన్ ఈ మధ్యకాలంలో వదులుకొని అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కూలి’ మాత్రమే ఉంది.

‘సలార్ పార్ట్ 2’ ఉన్న కూడా అదెప్పుడు మొదలవుతుందనేది క్లారిటీ లేదు. అయిన కూడా డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుందనే కారణం చూపించి ప్రాజెక్ట్స్ వదులుకుంది. అయితే దీనికి రీజన్ ఏంటనేది స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమె సినిమాలు కాకుండా మ్యూజిక్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తోందనే ప్రచారం నడుస్తోంది. ఆమె మెజారిటీ టైం దానికోసమే కేటాయిస్తుందని అనుకుంటున్నారు. అందుకే చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ని వదులుకుందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News