ప్రముఖ హీరోతో యువహీరోకి వైరమా?
సిద్ధాంత్ సరదాగా బదులిస్తూ ''నేను కొంత కపూర్‌ని కూడా తిన్నానని అనుకుంటున్నాను'' అని అన్నాడు.
గల్లీ బోయ్, గెహ్రైయాన్ లాంటి సంచలన చిత్రాలలో నటించాడు సిద్ధాంత్ చతుర్వేది. గల్లీ బోయ్ లో ర్యాపర్ గా అద్భుతంగా అభినయించిన అతడు గెహ్రయాన్ లో దీపికతో రొమాన్స్ ఇరగదీశాడు. అతడు నటించిన యాక్షన్ చిత్రం యుధ్రా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నగరంలోని గణేషుని విగ్రహాన్ని సందర్శించి లార్డ్ కి మొక్కి, అటుపై ప్రసాదం తింటూ కనిపించే వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ సమయంలో ఒక వ్యక్తితో సిద్ధాంత్ ముచ్చటిస్తున్నాడు. అవి చాలా పరిహాసంగా, తెలివిగా ఆకర్షించింది.
ప్రసాదంలో ఉన్న కపూర్ (కర్పూరం) గురించి అవతలి వ్యక్తి ప్రస్థావిస్తూ, అతడిని హెచ్చరించాడు. సిద్ధాంత్ సరదాగా బదులిస్తూ ''నేను కొంత కపూర్‌ని కూడా తిన్నానని అనుకుంటున్నాను'' అని అన్నాడు. మీరు కపూర్‌ను తిన్నారా? అని ఆ వ్యక్తి మళ్లీ ప్రశ్నించగా సిద్ధాంత్ చమత్కారంగా ''లేదు దానికి ఇంకా సమయం ఉంది!'' అని సమాధానమిచ్చాడు. ఓవరాల్ గా ఇది సరదా సంభాషణ మాత్రమే.
ఇదంతా పరిశ్రమలో సహనటుడు అయిన రణబీర్ గురించిన ప్రస్థావనే కానీ ఇది సుతిమెత్తగా సాగే, స్నేహపూర్వక పరిహాసం. రణబీర్ తో సిద్ధాంత్ కి సరిపడదు అనే మీనింగ్ ని తీసుకోకూడదు. రణబీర్ పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. అతడితో కలిసి నటించేందుకు సిద్ధాంత్ ఎప్పుడూ ఆసక్తిగా ఉన్నాడు. యుధ్రా ప్రమోషన్ లో భాగంగా సరదా చిట్ చాట్ అది.
కానీ యుధ్రాకు ఇలాంటి ప్రచారపుటెత్తుగడ కలిసొస్తుందా? మూవీలో మ్యాటర్ ఉంటే అది కచ్ఛితంగా బాక్సాఫీస్ విజయానికి సహకరిస్తుంది. కానీ ఈ తరహా ప్రచారం నిజంగా తెలివైనది. ఇది చాలా ట్రిక్కీ అని పలువురు విశ్లేషిస్తున్నారు.