పూరి, డీజే... అసలు మ్యాటర్ ఇదే!

డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా గురించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Update: 2024-10-14 14:30 GMT

డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ఇటీవల డబుల్‌ ఇస్మార్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో ఫ్లాప్‌ ని మూట కట్టుకున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా కచ్చితంగా సూపర్‌ హిట్ అనే అభిప్రాయంను అంతా వ్యక్తం చేశారు. కానీ పూరికి కాలం కలిసి రాలేదు. బాక్సాఫీస్ వద్ద డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ సైతం బొక్కబోర్లా పడింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏంటా అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో సిద్దు జొన్నలగడ్డ పేరు వినిపిస్తోంది. డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా గురించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

పూరి జగన్నాథ్‌ స్వయంగా సిద్దు జొన్నలగడ్డను కలిసి కథను వినిపించారు అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ లేదు. కానీ సిద్దు జొన్నలగడ్డ ను పూరి సంప్రదించారు అని, ప్రస్తుతం పూరి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సిద్దు జొన్నలగడ్డ ఆయన ప్రాజెక్ట్‌ ను సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సిద్దు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్‌ హిట్స్ తో దూసుకు పోతున్నారు. కనుక పూరి ఆయనతో సినిమా చేయాలని భావించారు. తన వద్ద ఉన్న కథ కు సిద్దు సెట్‌ అవుతాడని పూరి అనుకుని ఉంటారు. కానీ సిద్దు మాత్రం ఇప్పట్లో తాను కొత్త సినిమాను కమిట్ అవ్వలేను అంటూ పూరి సినిమాకు నో చెప్పారట.

ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్‌ హిట్స్ ఇచ్చి పలువురు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు మాత్రం చిన్న హీరోలతో సినిమాలు చేసేందుకు కష్టపడాల్సి వస్తుంది. సిద్దు వంటి చిన్న హీరో గతంలో పూరి దర్శకత్వంలో చిన్న రోల్‌ చేసే అవకాశం వచ్చినా ఎగిరి గంతు వేసి మరీ చేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం పూరి అడిగినా బాబోయ్‌ నీకు దండం అంటూ నో చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పూరి ఏం చేస్తారు, అసలు ఆయన తదుపరి సినిమా ఉంటుందా లేదా అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. పూరి వ్యక్తిగత విషయాలు సైతం ఈ సమయంలో చర్చనీయాంశం అవుతున్నాయి.

సిద్దు జొన్నలగడ్డ వరుసగా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ సినిమాలతో హిట్‌ కొట్టాడు. త్వరలోనే టిల్లు క్యూబ్‌ తోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని ఇతర సినిమాలను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను సిద్దు జొన్నలగడ్డ ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా మూడు నాలుగు సినిమాలు ఉన్న కారణంగా సిద్దు జొన్నలగడ్డ కొత్తగా మరే సినిమాకు కమిట్ అవ్వడం లేదని, అందుకే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు నో చెప్పారు అంటున్నారు. పూరితో కాస్త లేట్‌ గా అయినా సిద్దు సినిమా చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News