సితారతో సిద్ధు "కోహినూర్"

తెలుగు సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటునే అతికొద్ది మంది నటులలో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు.

Update: 2024-10-12 05:54 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటునే అతికొద్ది మంది నటులలో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. ఇక ఈ యువ హీరో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మరోసారి భారీ సినిమా ప్రకటించారు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తరువాత, ఈ అద్భుతమైన కాంబినేషన్ మరొక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే, ఈ చిత్రం కూడా సంచలనంగా నిలిచేలా కనిపిస్తోంది.


ఈ సినిమా కథ "కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం" అనే వినూత్నమైన కథాంశంపై సాగుతుందని మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. భద్రకాళి దేవి మహిమగా నిలిచిన ఐకానిక్ వజ్రం, కాలక్రమేణా సామ్రాజ్యవాదుల చేతికి చిక్కిపోతుంది. ఈ వజ్రాన్ని తిరిగి భారతీయులకి చేరవేయడానికి ఒక యువకుడు చేసే సాహసోపేతమైన ప్రయాణాన్ని ఈ సినిమా చూపించనుంది.

కోహినూర్ వజ్రాన్ని తిరిగి దేశానికి తీసుకురావడం అంత సులువు కాదని పోస్టర్ లోని డిజైనింగ్ స్పష్టం చేస్తోంది. సిద్ధు పాత్ర చాలా పవర్ ఫుల్ గా కనిపించబొతున్నట్లు అర్ధమవుతుంది. ఇక సినిమాకు సంబంధించి పోస్టర్ చాలా ప్రత్యేకత కలిగినదిగా నిలిచింది. పోస్టర్‌లో సిద్ధు ఒక చారిత్రాత్మక పాత్రలో కనిపించగా, భద్రకాళి దేవి విగ్రహం మధ్యన వజ్రం అమరించబడినట్లు చూపించబడింది.

సినిమాలో విజువల్స్ మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఉంటాయని అర్ధమవుతుంది. ముఖ్యంగా, ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, అంచనాలు మరింత పెంచేస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రవికాంత్ "క్షణం" వంటి అద్భుతమైన థ్రిల్లర్‌ని అందించి, 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో సిద్ధుతో కలిసి ప్రేక్షకులను మెప్పించారు.

ఇప్పుడు, ఈ ఇద్దరూ కలిసి వస్తున్న కొత్త సోషియో-ఫాంటసీ కథ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్న సంగీత దర్శకుడు ఇంకా ప్రకటించబడకపోయినా, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం చాలా ప్రతిభావంతులైన టెక్నీషియన్స్ పని చేయబోతున్నారని అర్ధమవుతుంది. ఈ చిత్రం 2026 జనవరిలో థియేటర్లలో విడుదలకానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రెండు సెన్సేషనల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సిద్ధు మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కోసం మళ్లీ కలసి హ్యాట్రిక్ అందించబోతున్నారు. మరి సినిమా కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే టీజర్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News