కాబోయే భర్తతో పి.వి.సింధు డిన్నర్ డేట్
భారత స్టార్ షట్లర్.. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు డిసెంబర్ 22న పెళ్లి చేసుకోబోతున్నారు.
భారత స్టార్ షట్లర్.. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు డిసెంబర్ 22న పెళ్లి చేసుకోబోతున్నారు. కాబోయే భర్త దత్తసాయి పొసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్ దత్తసాయి అన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్‌లోని ఓ కోటలో ఈ జంట వివాహం జరగనుంది. 24 డిసెంబర్ హైదరాబాద్ లో భారీగా రిసెప్షన్ జరగనుంది.
కాబోయే భర్త దత్తసాయితో పి.వి.సింధు డిన్నర్ డేట్ కి వెళ్లిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. భర్తతో కలిసి కార్ లో షికార్ చేస్తూ సెల్ఫీ తీసుకున్న ఫోటో వెబ్ లో సందడి చేస్తోంది. వధూవరుల ఫోటోలను అభిమానులు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా షేర్ చేస్తున్నారు.
వృత్తిపరంగా చూస్తే... ఇటీవల పి.వి. సింధు తన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) వరల్డ్ టూర్ లో భాగంగా లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి `వు లుయో యు`ను ఓడించిన సంగతి తెలిసిందే. 47 నిమిషాల పాటు జరిగిన టైటిల్ పోరులో సింధు 21-14, 21-16తో రెండు వరుస గేమ్‌ల తేడాతో లుయో యును ఓడించింది. ఇది BWF సూపర్ 500 టోర్నమెంట్.. జూలై 2022లో సింగపూర్ ఓపెన్ టైటిల్ తర్వాత సింధు మొదటి బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్. 2023 తర్వాత సింధు స్పెయిన్ మాస్టర్స్ , మలేషియా మాస్టర్స్ లోను అద్భుతంగా రాణించి ఫైనల్స్‌కు చేరుకుంది కానీ టైటిల్ గెలవలేకపోయింది.
తన కెరీర్ జర్నీలో సింధు BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలను సాధించింది. ఈ ఘనత సాధించిన మరో మహిళ గా చైనాకు చెందిన జాంగ్ నింగ్ పాపులరైంది. 2016 రియో ఒలింపిక్స్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌తో జరిగిన గట్టిపోటీ తర్వాత రజత పతకాన్ని సాధించి ఒలింపిక్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పి.వి.సింధు నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్రను సృష్టించింది. అక్కడ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రెండు ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా పి.వి.సింధు నిలిచింది. పి.వి.సింధు భారతదేశం సహా ప్రపంచ దేశాల్లోని యువతలో స్ఫూర్తిని నింపారు.