విడాకుల‌తో సింగర్ విర‌హ‌వేద‌న‌

భార‌తీయ వనిత అయిన ప్రియాంక చోప్రాను చూసి నేర్చుకోవాల‌ని, పీసీ సాంప్ర‌దాయాల‌తో సోఫీ క‌ల్చ‌ర్ ని పోల్చి చూప‌డం త‌న‌ని తీవ్రంగా కించ‌ప‌రిచింది! అంటూ క‌థ‌నాలొచ్చాయి.

Update: 2023-11-18 16:17 GMT

అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా బావ‌గారైన జో జోనాస్ త‌న భార్య సోఫీకి విడాకులు ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ ఒక‌రి నుంచి ఒక‌రు విడిపోతున్నామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న అనంత‌రం భార్యాభ‌ర్త‌ల‌ క‌ల‌త‌ల్లో ప్రియాంక చోప్రా (పీసీ) ప్ర‌మేయం ఉందంటూ కొన్ని మీడియాలు క‌థ‌నాలు రాసాయి. జోనాస్ కుటుంబం సోఫీపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. భార‌తీయ వనిత అయిన ప్రియాంక చోప్రాను చూసి నేర్చుకోవాల‌ని, పీసీ సాంప్ర‌దాయాల‌తో సోఫీ క‌ల్చ‌ర్ ని పోల్చి చూప‌డం త‌న‌ని తీవ్రంగా కించ‌ప‌రిచింది! అంటూ క‌థ‌నాలొచ్చాయి.

జో జోనాస్ ఇటీవల సోఫీ టర్నర్ నుండి విడిపోయిన తరువాత తదుపరి పిల్ల‌ల‌ కస్టడీ యుద్ధం మొద‌లైంది. ఇంత‌లోనే హార్ట్ బ్రేక్ అయిన థీమ్‌ను ప్రతిబింబించే ఒక రహస్య పచ్చబొట్టును జోనాస్ రివీల్ చేసారు. ఈ వారం అల్బెర్టా- ఎడ్మంటన్‌లో జోనాస్ బ్రదర్స్ కచేరీలో ప్రదర్శన సందర్భంగా గాయకుడు జో జోనాస్ తన ర‌హ‌స్య పచ్చబొట్టును ప్రదర్శించాడు. అది చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

ప్ర‌ఖ్యాత `పేజ్ సిక్స్` క‌థ‌నంలో హైలైట్ చేసిన దాని ప్ర‌కారం.. కొత్త ఫోటోల్లో జో జోనాస్ కుడి చేతిపై తాజా టాటూ క‌నిపించింది. ఇందులో విలియం స్టాఫోర్డ్ కోట్ ఉంది. బోల్డ్ బ్లాక్ లెట‌ర్స్ క‌నిపించాయి. విరిగిన ప్రతిదాని నుండి నేను పారాచూట్‌ను నేసాను..! అని పెద్ద అక్షరాలతో హైలైట్ చేయ‌డం క‌నిపించింది. జో ఈ సందర్భంగా తెల్లటి రిబ్బెడ్ ట్యాంక్ టాప్‌ని ధ‌రించి క‌నిపించాడు. దీనివ‌ల్ల అతడి శరీరంపై టాటూ క్లియ‌ర్ క‌ట్ గా క‌నిపించింది. అతడు తన కుమార్తె పుట్టినరోజు జ్ఞాపకార్థం ఛాతీ టాటూను రివీల్ చేసిన‌ కొద్దిసేపటికే ఇప్పుడు చేతిపై టాటూ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

జో కొత్త పచ్చబొట్టు అత‌డి పిల్లలు విల్లా - డెల్ఫిన్‌లపై కస్టడీ యుద్ధం పరిష్కారంతో సమానమైన‌ద‌న్న చ‌ర్చ సాగుతోంది. న‌టి సోఫీ టర్నర్ తో జో ఫైట్ ఇంకా కొన‌సాగుతోంది. ఈ జంట పిల్ల‌ల క‌స్ట‌డీపై మ‌రింత వివ‌రం తెలియాల్సి ఉంది. సోఫీ - జో సెప్టెంబరు 5న అధికారికంగా విడాకుల కోసం దాఖలు చేశారు. వారి నాలుగేళ్ల వివాహానికి ముగింపు పలికారు. జో జోనాస్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లు .. మార్పుల గురించి ఈ పచ్చబొట్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Tags:    

Similar News