స్కంద బిజినెస్ డీల్స్.. జరిగింది ఇది!
అయితే ఈ సారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో బోయపాటి దర్శకత్వంలో స్కంద మూవీ చేశారు
రామ్ పోతినేని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికి రూట్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. యంగ్ హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల కెరియర్ లో చాలా సక్సెస్ లు అందుకున్న కూడా తనని తాను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాడు. ఇప్పటికి ఫ్యామిలీ హీరో ఇమేజ్ నే రామ్ పోతినేనికి ఉంది. అతనికి సక్సెస్ లు వచ్చిన సినిమాలు అన్ని కూడా కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లుగానే వచ్చాయి.
ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రం రామ్ పోతినేని మాస్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ అతని ఇమేజ్ ని కూడా అమాంతం మార్చేసింది. తరువాత కెరియర్ పరంగా కాస్తా నెమ్మదించి మాస్ అండ్ యాక్షన్ టచ్ ఉన్న కథలపైన శ్రద్ధ పెట్టారు. చివరిగా రామ్ పోతినేని ది వారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే ఈ సినిమా తెరకెక్కిన ఆశించిన సక్సెస్ అందుకోలేదు.
అయితే ఈ సారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో బోయపాటి దర్శకత్వంలో స్కంద మూవీ చేశారు. బోయపాటి సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి పూనకాలొచ్చేస్తాయనే సంగతి తెలిసిందే. అతని సినిమాలలో ఫ్యామిలీ టచ్ ఉన్న అంతకుమించి పవర్ ఫుల్ మాస్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా గూస్ బాంబ్స్ తెప్పించే విధంగా ఉంటాయి.
అలాంటి దర్శకుడితో పాన్ ఇండియా రేంజ్ లో స్కంద మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో రఫ్ లుక్ లో రామ్ కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సంబందించిన థీయాట్రికల్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయ్యిందంట. రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది.
మొత్తం 50 కోట్ల వరకు బిజినెస్ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా రిటర్న్స్ నిర్మాతకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా ఐదు భాషలలో మూవీ రిలీజ్ కాబోతోంది. హిందీలో కూడా బోయపాటి యాక్షన్ మోడ్ కథలకి మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి అక్కడ బిజినెస్ బాగానే జరిగిందంట. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అయితే పూరితో చేస్తోన్న డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.