మోక్షజ్ఞ కోసం రంగంలోకి క్రేజీ ప్రొడ్యూసర్

దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి.

Update: 2024-08-31 11:42 GMT

దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన రన్ సినిమాతో SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాతగా సుధాకర్ చెరుకూరి సినీ ప్రయాణం మొదలు పెట్టారు. ఆ తరువాత పడిపడి లేచే మనసు. ఆడాళ్ళు మీకు జోహార్లు. రామారావు ఆన్ డ్యూటీ, విరాటపర్వం, దసరా, రంగబలి సినిమాలు సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అయితే నిర్మాతగా ఆయనకి వరుసగా ఐదు ఫ్లాప్ లు వచ్చాయి.

తరువాత నానితో చేసిన దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. మరల నాగ శౌర్యహీరోగా చేసిన రంగబలి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం SLV సినిమాస్ బ్యానర్ లో నానితో పాటు, విశ్వక్ సేన్ తో మూవీస్ చేయనున్నాడు. అలాగే కన్నడలో దీక్షిత్ శెట్టి హీరోగా ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యానర్ లోనే నందమూరి బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ అరంగేట్రం ఉండబోతోందంట.

ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరో కథాంశంతో ఉంటుందనే టాక్ బయటకొచ్చింది. ఇప్పుడు సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. SLV సినిమాస్ బ్యానర్ లో సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మకి సుధాకర్ చెరుకూరి అడ్వాన్స్ ఇచ్చారంట. బాలకృష్ణ హీరోగా ఈ సినిమా చేయాలని అనుకున్నారంట. అయితే బాలయ్య మోక్షజ్ఞ బాధ్యతలు నిర్మాతకి అప్పగించారంట.

ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక మరొక సినిమా చేస్తానని బాలయ్య నిర్మాతకి మాటిచ్చారంట. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ ఇప్పటికే స్టార్ట్ చేసారంట. సెప్టెంబర్ 6న ఈ సినిమాకి ప్రారంభోత్సవం గ్రాండ్ గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. రామకృష్ణ స్టూడియోస్ లో మోక్షజ్ఞ సినిమా లాంచింగ్ జరగబోతోందంట. త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన రానున్నట్లు సమాచారం. అభిమాన్యుడి క్యారెక్టర్ రిఫరెన్స్ తో ప్రశాంత్ వర్మ అదిరిపోయే కథని మోక్షజ్ఞ కోసం సిద్ధం చేసారంట.

మరి నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య వారసుడిగా రాబోతున్న మోక్షజ్ఞ ఏ స్థాయిలో మెప్పిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా ఉన్నాడు. ఇక మోక్షజ్ఞ మొదటి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే కచ్చితంగా అతని కెరియర్ లో చాలా ప్లస్ అవుతుందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News