చైతూ బర్త్ డే.. శోభిత ప్లాన్ తెలిస్తే షాకే!!

అయితే గోవాలో ప్రస్తుతం ఉన్న శోభిత.. నేడు నాగచైతన్య బర్త్ డే సందర్భంగా పెద్ద సర్ప్రైజ్ ను ప్లాన్ చేసినట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Update: 2024-11-23 06:16 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.. మరికొద్ది రోజుల్లో వేదమంత్రాల మధ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మూడు ముళ్ల బంధంతో చైతూ, శోభిత ఒక్కటవ్వనున్నారు.

అక్కినేని కుటుంబ వారసత్వంలో భాగమైన అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4న రాత్రి 8.13 నిమిషాలకు కొత్త జీవితంలోకి నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే వీరి వెడ్డింగ్ కార్డ్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఓ అందమైన సెట్ లో కొత్త జంట వివాహ వేడుక సింపుల్ గా జరగనుంది.

ఆ విషయాన్ని నాగార్జున రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ మీడియాతో షేర్ చేసుకున్నారు. శోభిత తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలని కోరారని, తనకు కూడా ఆ మంత్రాలు వినడం ఎంతో ఇష్టమని తెలిపారు. అందుకే నాగచైతన్య - శోభిత మ్యారేజ్ సాంప్రదాయమైన తెలుగు పెళ్లి కానుందని చెప్పారు. పెళ్లి పనులు శోభిత, చైతూనే చూసుకుంటున్నట్లు తెలిపారు.

మరో 15 రోజుల్లో వివాహం జరగనుండగా.. గోవాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు శోభితతోపాటు నాగార్జున కుటుంబమంతా హాజరైంది. వారంతా రెడ్ కార్పెట్ పై రీసెంట్ గా సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే గోవాలో ప్రస్తుతం ఉన్న శోభిత.. నేడు నాగచైతన్య బర్త్ డే సందర్భంగా పెద్ద సర్ప్రైజ్ ను ప్లాన్ చేసినట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. తనకు కాబోయే భర్తకు బోలెడు సర్పైజ్ లు ఇచ్చేలా ఇప్పటికే అన్ని రెడీ చేసినట్లు సమాచారం. గోవాలోని ఓ బీచ్ ఒడ్డున తన ఫ్యామిలీతో కలిసి శనివారం ఈవెనింగ్ స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అక్కినేని అభిమానులు తెగ స్పందిస్తున్నారు. చైతూకు శోభిత ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలను అందించేలా ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. బర్త్ డే పిక్స్, వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో హ్యాపీ బర్త్ డే చైతూ అన్న అంటూ విషెస్ తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News