పెళ్లికి ముందు శోభిత మరో వివాహం చుట్టూ!
తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇప్పటికే నిశ్చితార్దం ముగించారు. దీంతో ఆ వివాహ తేదీ కోసం ప్రేక్షకాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పెళ్లికూతురు..పెళ్లి కోడుకు మాత్రం సినిమా షూటింగ్ లు అంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శోభిత నటిస్తోన్నసినిమాలు ఆసక్తికరంగా మారాయి.
అమె నటించిన తాజా సినిమా `లవ్ సితార`. వందనా కటారాయా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ పంజాబీ చెఫ్ తో ప్రేమలో పడిన సితార వివాహం చుట్టూ తిరిగే కథ...చైతన్యని వివాహమాడే ముందు శోభిత సినిమా కూడా వివాహం నేపథ్యం కావడం ఇంట్రెస్టింగ్.
కాగా ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సినిమా గురించి శోభిత మాట్లాడుతూ...` ఇందులో ప్రతీ పాత్ర కొత్తగా..సవాల్ గా ఉంటుంది. ప్రేమ గొప్ప తనాన్ని తెలిపే సితారపాత్ర పోషించా. ఆమె చాలా తెలివైంది. అన్ని విషయాల్లోనూ సూటిగా నిజాయితీగా ఉంటుంది. ఆమె దైర్యం, సంకల్పం నాకెంతో స్పూర్తినిచ్చాయి. ఈ అంశాల కారణంగా ఆపాత్ర పోషించా. ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కోంటున్న సవాళ్లు, కుటుంబ విలువల్నీ ఈ సినిమా తెలియజేస్తుంది` అని అంది.
మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. శోభితకి నటిగా మంచి గుర్తింపు ఉంది. వైవిథ్యమైన పాత్రలు సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమై ఇమేజ్ ని సంపాదించుకుంది. `మంకీ మ్యాన్` అనే అమెరికన్ చిత్రంలో కూడా నటించింది. అలా హాలీవుడ్ లో కూడా శోభిత ఎంట్రీ ఇచ్చింది.