పెద్ద బాంబ్ పేల్చిన స్టార్ హీరో మాజీ ప్రియురాలు

స‌ల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమీ అలీ ఇటీవ‌ల వ‌రుస కామెంట్ల‌తో మీడియా హెడ్ లైన్స్ లో సంచ‌ల‌నంగా మారుతున్నారు.

Update: 2024-10-21 23:30 GMT

స‌ల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమీ అలీ ఇటీవ‌ల వ‌రుస కామెంట్ల‌తో మీడియా హెడ్ లైన్స్ లో సంచ‌ల‌నంగా మారుతున్నారు. ఓవైపు గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ హీరో స‌ల్మాన్ పై హ‌త్యా బెదిరింపుల‌కు పాల్ప‌డుతుంటే సోమీ అలీ ఆ ఇద్ద‌రి పైనా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ స‌ల్మాన్ కి ఇబ్బందిక‌రంగా మారుతోంది. ఇంత‌కుముందు స‌ల్మాన్ ను హ‌త్య చేయాల‌నుకోవ‌డం స‌రైన ఆలోచ‌న కాద‌ని గ్యాంగ్ స్ట‌ర్ కి నీతులు చెప్ప‌బోయింది. కానీ దానిని ఎవ‌రూ విన‌లేదు.

ఒక న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సోమీ అలీ `కృష్ణ జింక వేట‌- హత్య కేసు` కొన‌సాగుతున్న‌ప్పుడు సల్మాన్‌తో చర్చించినట్లు పేర్కొంది. బిష్ణోయ్ కమ్యూనిటీకి కృష్ణజింక అంటే ఎంత‌టి ప్రాముఖ్యత క‌లిగి ఉన్న‌దో సల్మాన్ ఖాన్‌కు తెలియదని సోమీ వ‌కాల్తా పుచ్చుకుంది. తనకు తెలియని దాని గురించి అతడు ఎందుకు క్షమాపణ చెప్పాలి? అది అనుకోకుండా.. ఏదో జ‌రిగిపోయింది... దానికి క్షమాపణ చెప్పమని బలవంతం చేయడమేమిటో అర్ధం కాదు.. అని సోమీ అన‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇది అహం గురించి కాదు. అతడు (సల్మాన్) చాలా అహంకారి అని కొంద‌రు.. అతడికి మంచి పేరు ఉందని మ‌రికొంద‌రు ప్రజలు అంటున్నారు. ఈరోజు అతడితో గానీ, అతడి కుటుంబంతో గానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. బాలీవుడ్ లేదా హాలీవుడ్‌లో ఎవరినీ హత్య చేయకూడదనుకుంటున్నాను. హింస ఎప్పటికీ సమాధానం కాదు! అని సోమీ అలీ అన్నారు.

1998లో జరిగిన సంఘటన గురించి సోమీ అలీ మాట్లాడుతూ..``ఆ ఘ‌ట‌న‌లో కృష్ణ జింక ప్రాముఖ్య‌త గురించి, సల్మాన్‌కు తెలియదని బిష్ణోయ్ సమాజం అర్థం చేసుకోవాలి. తనకు దాని గురించి తెలియ‌ద‌ని, అస్స‌లు ఐడియా లేద‌ని అతడు నాతో చెప్పాడు. సల్మాన్‌కు తెలియదని నేను మీకు హామీ ఇస్తున్నాను`` అని అన్నారు.

నాటి రోజుల్లో ఔట్‌డోర్ షూటింగ్‌ల్లో సల్మాన్‌తో కలిసి చాలాసార్లు వేటాడాను అని కూడా సోమీ అలీ పేర్కొన్నారు. అయితే అత‌డు వేట‌కు త‌న‌ను రావొద్ద‌ని అన్నాడ‌ట‌. ``నువ్వు కావాలని బిగ్గరగా వేటాడతావు.. జంతువులు పారిపోతాయి`` అని అతడు నన్ను తీసుకుని వెళ్ల‌లేదు. నాకు ఇది ఒక‌ క్రీడగా వేటాడటం ఇష్టం లేదు. ఒకసారి కూడా నేను వెళ్ళలేదు.. అతడు ఆ త‌ర్వాత‌ జంతువుల‌ను పట్టుకోవడం ముగించాడు! అని తెలిపారు. అయితే స‌ల్మాన్ ఖాన్ కి నిరంత‌రం జంతువుల‌ను వేటాడే అల‌వాటు ఉంద‌ని సోమీ అలీ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేసింది. ఇది ఈ సంద‌ర్భంలో కొత్త వివాదాన్ని రేకెత్తించింది. స‌ల్మాన్ ఒక కృష్ణ జింక‌ను చంప‌లేదు.. ఇంకా చాలా జంతువ‌లను చంపాడ‌ని సోమీ చెబుతోందా? అంటూ నెటిజ‌నులు సందేహాలు లేవ‌నెత్తుతున్నారు. ఇది అట‌వీ చ‌ట్టాల ప్ర‌కారం చాలా పెద్ద నేరం.. ! అని కూడా విశ్లేషిస్తున్నారు. సోమీ త‌న మాజీకి మేలు చేయ‌బోయి కీడు త‌ల‌పెడుతోంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News