బాలయ్య హీరోయిన్ డివోషనల్ మోడ్..!

సినిమాల అవకాశాలు ఎలా ఉన్నా సరే సోనాల్ కి సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది.

Update: 2025-02-10 15:11 GMT

నందమూరి బాలకృష్ణతో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ సోనాల్ చౌహన్ రెండేళ్ల క్రితం ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో చిన పాత్రలో నటించింది. లాస్ట్ ఇయర్ దార్డ్ అనే సినిమాలో నటించిన అమ్మడు సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ సందడి చేస్తుంది. సినిమాల అవకాశాలు ఎలా ఉన్నా సరే సోనాల్ కి సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక లేటెస్ట్ గా అమ్మడు డివోషన మోడ్ కి స్విచ్ ఆన్ అయ్యింది.


ప్రస్తుతం ప్రయాగ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకి సినీ తారలు కూడా వరుస కడుతున్నారు. ఐతే ఈ కుంభమేళాకి వెళ్లి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తూ సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సోనాల్ చౌహాన్ కూడా మహా కుంభమేళాకి వెళ్లి అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసింది. దానికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సోనాల్ చౌహాన్ తెలుగు ఆడియన్స్ కి సుపరిచితురాలు. రెయిన్ బో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాలయ్య తో కలిసి నటించింది. ఎఫ్3 తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ లో చేసింది అమ్మడు. ఐతే సినిమాల పరంగా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేని సోనాల్ తన గ్లామర్ ఫోటో షూట్స్ తో మాత్రం సర్ ప్రైజ్ చేస్తుంది. ఐతే సోనాల్ ఎంత ప్రయత్నించినా సరే ఆమె ఏమాత్రం వెనకపడుతూనే ఉంది.

ప్రయాగ్ లో సోనాల్ ఫోటోస్ చూసిన ఆమె ఫాలోవర్స్ సూపర్ అనేస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీస్ అంతా కూడా కుభమేళాకి వెళ్లి అక్కడ తాము ఆచరించిన పవిత్ర స్నానల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సోనాల్ ఫోటోలు కూడా ఆమె ఫాలోవర్స్ కి తెగ నచ్చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ మెటీరియలే అయినా సోనాల్ కెరీర్ పరంగా అంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. దానికి స్పెసిఫిక్ గా కారణాలు అంటూ ఏవి లేకపోయినా సరే ఎందుకో అమ్మడిని ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఐతే తన గ్లామర్ పరంగా అయినా అమ్మడు కాస్త ఫోకస్ చేసి ఉంటే మాత్రం కచ్చితంగా ఒక రేంజ్ కి వెళ్లేది. ఐతే సోనాల్ ఎంట్రీ ఇచ్చి దాదాపు 17 ఏళ్లు అవుతున్నా ఆమెకు రావాల్సిన సరైన గుర్తింపు రాలేదని చెప్పొచ్చు.

Tags:    

Similar News