వీడియో: బాడీ హగ్గింగ్ ఫ్రాక్‌లో సోనాల్ విందు
ఇక సోనాల్ కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా దర్శకనిర్మాతలు కూడా తనకు అలాంటి గొప్ప పాత్రను కూడా ఆఫర్ చేయలేదు.
నందమూరి బాలకృష్ణ సరసన వరుస అవకాశాలు అందుకుంది సోనాల్ చౌహాన్. ఆశించిన విజయాల్ని కూడా దక్కించుకుంది. కానీ ఎందుకనో ఇవేవీ స్టార్ అవ్వాలన్న తన డ్రీమ్ నెరవేర్చుకునేందుకు సహకరించలేదు. సోనాల్ ఒక గ్లామరస్ డాళ్ అన్న ముద్ర పడింది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు కెరీర్ లో వైవిధ్యమైన పాత్రల్లో అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. ఇక సోనాల్ కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా దర్శకనిర్మాతలు కూడా తనకు అలాంటి గొప్ప పాత్రను కూడా ఆఫర్ చేయలేదు.
బాలీవుడ్ లోను సోనాల్ కు అవకాశాల్లేవ్. చివరిసారిగా ఆదిపురుష్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ బంగ్లాదేశ్ కి చెందిన ప్రముఖ పంపిణీదారుడు నిర్మిస్తున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ లో అవకాశం అందుకుంది. దర్థ్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ కథానాయికగా నటించింది. ఇందులో షకీబ్ ఖాన్ హీరో. అయితే ఈ సినిమా విడుదలైందా లేదా? అన్నదానిపై ప్రజలకు అంతగా ఆసక్తి లేదు. గత ఏడాది విడుదలై అలా వెళ్లింది.
మరోవైపు సోనాల్ ఈ తీరిక సమయంలో సోషల్ మీడియా ఫోటోషూట్లపై ఫుల్ ఫోకస్సివ్ గా ఉంది. వరుస ఫోటోషూట్లతో ఇన్ స్టాలో ఈ భామ హీట్ పుట్టిస్తోంది. తాజా ఫోటోషూట్ లో బ్లాక్ ఫ్రాక్ లో టోన్డ్ లుక్ తో కనిపించింది. బాడీ హగింగ్ గౌనులో స్టన్నర్ అని నిరూపించింది. సోనాల్ బోల్డ్ ఫోటోషూట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ గా మారుతోంది.