గుంటూరు కారంలో 'మురారీ' జోడీ!
అది అందరికీ తెలిసిన విషయమే. అయితే గురూజీ అభిమానులకు మరో పెద్ద సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది.
మాటల మాంత్రికుడు వెటరన్ నటీమణుల్ని దించడం ప్రతీ సినిమాకి ఓ అనవాయితీగా అనుసరిస్తోన్న సంగతి తెలిసిందే. రాను రాను గురూజీ సినిమాల్లో సీనియర్స్ ని తెరపైకి తేవడం ఆయనకు ఓ సెంటిమెంట్ గానూ మారిపోతుంది. 'అత్తారింటికి దారేది'లో నదియా...'సన్నాఫ్ సత్యమూర్తి'లో స్నేహ.. మళ్లీ 'అఆ' లో నదియాని రిపీట్ చేయడం..'అజ్ఞాతవాసి'లో ఖుష్బూ..అ'రవింద సమేత'లో దేవయాని..సుప్రీయ పాటక్.. 'అలవైకుంఠపురములో' టబు ఇలా అవసరం మేర పాత్రలు డిమాండ్ చేస్తే సీనియర్ భామల్ని రంగంలోకి దించి సక్సెస్ అందుకోవడం గురూజీ ప్రత్యేకత.
ఇది సక్సెస్ సెంటిమెంట్ గానూ మారిపోయింది. మరి 'గుంటూరు కారం'లోనూ అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారా? మరో సీనియర్ బ్యూటీని రంగంలోకి దించుతున్నారా? అంటే అవుననే లీకులం దుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే సినిమాలో ఓ కీలకమైన పాత్రని ఇప్పటికే సీనియర్ నటి రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
అది అందరికీ తెలిసిన విషయమే. అయితే గురూజీ అభిమానులకు మరో పెద్ద సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. సినిమాలో ఓ గెస్ట్ పాత్ర కోసం ఏకంగా ఒకప్పటి సూపర్ హీరోయిన్ సోనాలీ బింద్రేని సీన్ లోకి తెస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సినిమాలో సోనాలి తెరపై కాసేపు కనిపించనుందిట. ఆమె ఇరవై నిమిషాల పాటు అభిమానుల్ని అలరించనుందని సమాచారం.
ఆ సన్నివేశాలు కూడా సూపర్ స్టార్ మహేష్ తోనే ఉన్నాయట. ఇదే నిజమైతే నాటి 'మురారీ' జోడీని మళ్లీ మురిపించినట్లే. మురారీ సినిమాలో మహేష్-సోనాలీ బింద్రే పెయిర్ కి ఎంత పేరొచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్. మ్యూజికల్ గానూ అతి పెద్ద సంచలనం సాధించిన సినిమా. పెళ్లి కొడుకు..పెళ్లి కూతురు గా మహేష్-సోనాలీ బింద్రే మెప్పించిన వైనం ఇప్పటికీ వావ్ అనిపిస్తుంది. అలాంటి జోడీని గురూజీ మళ్లీ తెరపై చూపిస్తే సంచలనమే కదా.