దొంగోడికి షూస్ ఎలా కొనిస్తాం సాబ్!
బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఎంత గొప్ప మానవతా వాది అన్నది చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఎంత గొప్ప మానవతా వాది అన్నది చెప్పాల్సిన పనిలేదు. కరోనా కష్ట సమయంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. దీంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఇప్పటికీ సహాయం అనే సౌండ్ ఆయన చెవిన పడాలి గానీ వెంటనే ఆదుకోవడానికి ముందుకొస్తారు. తాజాగా సోనుసూద్ పేరు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వె ళ్తే `ఓ కస్టమర్ ఇంటి బయట ఉన్న బూట్లను చోరీ చేసిన డెలివరీ బాయ్ వీడియో రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ డెలవరీ బాయ్‌కు సోనూ సూద్ అండగా నిలిచాడు. బూట్లు చోరీ చేసిన అతడిపై కంపెనీ కానీ.. అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరాడు. తినుబండారాలు డెలివరీ సమయంలో ఎవరివైనా షూ చోరీ చేస్తే.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా ఓ కొత్త షూ కొనివ్వండి. అతడికి అవి అవసరం కావొచ్చు. కాబట్టి దయగా ఉండండి`` అని ఎక్స్ రాసారు. అయితే ఈ ట్వీట్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎవరి అనుమతి లేకుండా షూస్ ని దొంగతనం చేసిన వారిని ప్రోత్సహించడం ఏంటి? అది తప్పు అని చెప్పాల్సింది పోయి...చెప్పుకుండా షూస్ తీసుకెళ్లిపోత ఊరుకోవాలా? పైగా అలాంటి వారికి కొత్త షూ కొనివ్వాలా? అతడి కష్టం అర్దం చేసుకోగలం. కానీ అతను చేసింది పెద్ద తప్పు అంటూ కొందరుకామెంట్ చయగా మరికొంత మంది అతడు తీసుకెళ్లిపోవాలంటే అక్కడున్న వాటన్నింటిని చుట్టుబెట్టి పట్టికెళ్లిపోవచ్చు.
కానీ షూస్ ఒక్కటే తీసాడు అంటే ? అతడిలో నిజాయితీని అంతే గుర్తించాలి. బహుశా ఆషూస్ అంతవసరం కాబట్టే! అవి మాత్రమే తీసుకెళ్లాడు. అందులో తప్పు బట్టాల్సింది ఏముంది? అని మరికొంత మందని అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ కామెంట్లపై సోనుసూద్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి. ప్రస్తుతం సోనుసూద్ హిందీలోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ మళ్లీ నటించాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు.