సోఫియా గ్లామర్ ట్రీట్ కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్

కానీ మూవీ మాత్రం అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోవడం వల్ల కొత్త అవకాశాలు అందుకోలేదు సోఫియా చౌదరి.

Update: 2024-07-31 12:18 GMT

సోఫియా చౌదరి.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదా. సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ నేనొక్కడినే మూవీలో హీరోయిన్ గా నటించింది ఆ అమ్మడు. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో మహేష్ సరసన ఆడిపాడింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. లండన్ బాబు సాంగ్ సూపర్ హిట్ అయింది. కానీ మూవీ మాత్రం అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోవడం వల్ల కొత్త అవకాశాలు అందుకోలేదు సోఫియా చౌదరి.


ఆ మధ్య బిగ్ బాస్ సీజన్-14లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. కానీ ఆమె కెరీర్ ట్రాక్ లోకి రాలేదు. అయితే సోషల్ మీడియాలో సోఫియా చాలా యాక్టివ్ గా ఉంటోంది. తనదైన గ్లామర్ తో అలరిస్తుంటోంది. కొత్త కొత్త పిక్స్ పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటోంది. సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా.. మంచి ఛరిష్మానే మెయింటైన్ చేస్తోంది అమ్మడు. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ.. ఫాలోవర్స్ ను పెంచుకుంటూ దూసుకుపోతోంది సోఫియా చౌదరి.


తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది సోఫియా. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న అమ్మడు.. అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది. క్రేజీ మోడ్రన్ డ్రెస్ లో అదరగొట్టింది. గ్లాసెస్ పెట్టుకుని స్పెషల్ ఆర్నమెంట్స్ తో ఎట్రాక్ట్ చేసింది. ఓరగా చూస్తూ నెట్టింట సెగలు రేపుతోంది. తన అందాలతో హీట్ పుట్టిస్తోంది. క్లీవేజ్ గ్లామర్ తో అందరినీ ఫిదా చేస్తోంది. ప్రస్తుతం సోఫియా చౌదరి లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అమ్మడి పిక్స్ కు లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. హైలెట్ పిక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రీసెంట్ గా మహేష్ బాబుతో మరో సినిమాలో నటించాలని ఉందని చెప్పింది అమ్మడు. ఓ పాత్ర‌లో లేకుంటే పాట‌లో అయినా కలిసి ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నట్లు తెలిపింది. మ‌హేష్‌తో ప‌నిచేయ‌డం అద్భుత‌మైన అనుభ‌వ‌మ‌ని పేర్కొంది. మరి సోఫియాకు మహేష్ తో లేక టాలీవుడ్ లో ఏమైనా ఓ ఛాన్స్ వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News