నటి వేధింపులకు గురైంది.. కానీ నివిన్ సెట్లో మాతో ఉన్నారు
ఈ నివేదిక వెలువడిన అనంతరం మలయాళ చిత్రసీమలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
మాలీవుడ్ మీటూ సెకండ్ వేవ్ ప్రకంపనాలు సృష్టిస్తోంది. వేధింపులకు గురైన నటీమణులు ఒకరొకరుగా ఆరోపణలతో తెరపైకొస్తున్నారు. ఈ ఆరోపణల్లో పలువురు హీరోల పేర్లు బయటపడుతుండడంతో మాలీవుడ్ బెంబేలెత్తుతోంది. పరిశ్రమను నడిపించే పెద్దల గుండెల్లోనే దడ పుడుతోందని తాజా పరిణామం చెబుతోంది. ప్రముఖ నటి అపహరణ, వేధింపుల కేసులో జస్టిస్ హేమ కమిటీ నివేదిక పర్యవసానమిది. ఈ నివేదిక వెలువడిన అనంతరం మలయాళ చిత్రసీమలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
ఈ వేధింపుల ఆరోపణల్లోనే స్టార్ హీరో నివిన్ పౌళీపైనా నటి సౌమ్య ఆరోపణలు చేయడం సంచలనమైంది. ఒక సంవత్సరం క్రితం దుబాయ్‌లో 40 ఏళ్ల మహిళ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతో మంగళవారం కేరళలోని ఊన్నుకల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆరుగురిలో మలయాళ నటుడు నివిన్ పౌళీ ఒకరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అయితే నటులు వినీత్ శ్రీనివాసన్ , భగత్ మాన్యువల్ ..కూడా ఈ వేధింపుల్లో ఉన్నారని సదరు నటి పేర్కొంది. అయితే తన పేరును నటి ప్రస్థావించిన అనంతరం నివిన్ పౌళీ సదరు నటీమణి ఎవరో కూడా తనకు తెలియదని, దీనిపై న్యాయబద్ధంగా పోరాడుతానని మీడియా సమావేశంలో ప్రకటించారు.
తాజాగా శ్రీనివాసన్, భగత్ ఇరువురూ ఆ వేధింపులు అవాస్తవమని, నివిన్ తమతో కలిసి సెట్లో ఉన్నారని పేర్కొన్నారు. వినీత్ రిపోర్టర్ లైవ్‌తో మాట్లాడుతూ- గత ఏడాది డిసెంబర్ 14 , 15 తేదీల్లో కొచ్చిలో తమ సినిమా సెట్స్‌లో నివిన్ తనతో ఉన్నాడని పేర్కొన్నాడు. అలాగే డిసెంబర్ 15న తెల్లవారుజామున 3 గంటల వరకు కొచ్చిలోని ABAD న్యూక్లియస్ మాల్‌లో కలిసి ఉన్నామని అతను పేర్కొన్నాడు. ఆ రోజు నివిన్ తన తదుపరి సిరీస్ `ఫార్మా` సెట్‌కి వెళ్లాడని పేర్కొన్నాడు. పింక్ విల్లా కథనం ప్రకారం.. ``2023 డిసెంబర్ 14 మరియు 15 తేదీలలో కొచ్చిలో చిత్రీకరణలో నివిన్ మాతో ఉన్నాడు.. ఆ మహిళ వేధింపులకు గురైంది. మీరు కొంత వాస్తవాన్ని పరిశీలిస్తే, మేము కొచ్చిలో నివిన్ పేరుతో ఒక హోటల్‌ని బుక్ చేసాము. ``ప్రజలు చుట్టూ ఉన్న సీన్.. వేదికపై నివిన్‌తో సన్నివేశాలను చిత్రీకరించినట్లు మీరు పరిశీలించి చూడొచ్చు... వీటన్నింటినీ సులభంగా ధృవీకరించవచ్చు. ఆమె ఆరోపణల్లో నిజం లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది`` అని వారు పేర్కొన్నారు.
భగత్ .. నివిన్ తో పాటు తాను కూడా చిత్రీకరణలో ఉన్నప్పటి ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసారు. అతడు షేర్ చేసిన ఫోటోపై టైమ్ స్టాంప్‌ను అండర్‌లైన్ చేసి, మలయాళంలో ఇలా రాసాడు. ``డిసెంబర్ 14 ఉదయం 8 నుండి డిసెంబర్ 15 ఉదయం 3 గంటల వరకు, వినీత్, నివిన్ నేను కలిసి ఉన్నాము. ఈ ఫోటోలే నిదర్శనం`` అని అన్నారు.